ఏటీఎంల క్యూ కష్టాలకు చెన్నైవాళ్ల తెలివే తెలివి

Update: 2016-11-30 06:51 GMT
అదెలా సాధ్యమన్న సందేహం వచ్చిందా? నిజమే.. ఏటీఎం సెంటర్ల దగ్గర క్యూలలో గంటల కొద్దీ టైం వేస్టు చేసుకోకుండానే డబ్బులు తీసుకుంటున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల దగ్గరా.. ఏటీఎం సెంటర్ల దగ్గర విపరీతమైన రద్దీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి కష్టం చెన్నైవాసుల్లో కొందరికి అస్సలు లేవని చెబుతున్నారు.

అదెలా అన్నది చూస్తే.. షాకింగ్ గా అనిపించాల్సిందే. ఇలాంటి పద్ధతి ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. భయపడాల్సినంత రిస్క్ ఏమీ లేదంటూ వారు లైట్ తీసుకుంటున్నారు. ఇంతకీ వారేం చేస్తున్నారో చూస్తే.. రద్దు నిర్ణయం తర్వాత ఏటీఎంల దగ్గర ఎప్పుడు డబ్బు నింపుతున్నారో..ఎప్పుడు ఖాళీ అవుతుందో ఎవరికి అంతుపట్టనిదిగా మారింది.

దీంతో.. ఏటీఎం సెంటర్ల వద్ద ఉండే గార్డులకు.. తమ డెబిట్ కార్డులు ఇచ్చేస్తున్నారట. దాంతో పాటు తమ ఫోన్ నెంబరు ఇస్తున్న చెన్నై వాసులు.. ఏటీఎం మెషీన్లో డబ్బులు లోడ్ చేసిన వెంటనే.. ఆ విషయాన్ని తమకు కార్డులు ఇచ్చిన వారికి ఫోన్లు చేస్తున్నారు ఏటీఎం గార్డులు. తమ పిన్ నెంబరును చెప్పటం.. డబ్బుల్ని డ్రా చేసి గార్డు దగ్గరే ఉంచుకోవటం.. తమకు వీలు కుదిరినప్పుడు వచ్చేసి డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు. ఇదంతా చేసినందుకు గార్డుకు కొంత కమిషన్ గా ఇస్తున్నారట. అయితే.. ఇలాంటి డేంజర్ కదా అన్న మాటను అడిగితే.. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రూ.2వేలకు మించి ఏటీఎంల నుంచి రాని నేపథ్యంలో ఇదేం పెద్ద డేంజర్ కాదని తేల్చేస్తున్నారట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News