అన్నాడీంకేలో సాగుతున్న అంతర్గత పోరు అంతకంతకూ పెరుగుతోంది. చిన్నమ్మ.. పన్నీర్ మధ్య మొదలైన పవర్ గేమ్ పీక్స్ కు చేరుకోవటమే కాదు.. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీలో తనకున్న ‘పవర్’తో చిన్నమ్మ చెలరేగిపోతుంటే.. అపద్ధర్మ సీఎంగా పన్నీర్ కున్న ‘పవర్’తో షాకుల మీద షాకులిస్తూ.. తన దూకుడును మరింత పెంచారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే..
1. మరోసారి మీడియా ముందుకు వచ్చిన పన్నీర్.. అన్నాడీఎంకేను ఎవరూ హైజాక్ చేయలేరని.. పార్టీని చీల్చాలన్న కుట్రను సాగనిచ్చేది లేదని స్పస్టం చేశారు. త్వరలోనే శుభవార్త వింటారంటూ మరోసారి తన వర్గాన్ని ఊరించే ప్రయత్నం చేశారు. తమిళ ప్రజలపై తనకెంతో గౌరవం ఉందన్న ఆయన.. తాను ఎంజీఆర్.. జయలలిత బాటలో నడుస్తానని స్పష్టం చేశారు. పార్టీ నుంచి తనను బహిష్కరించేందుకు శశికళ ఎవరంటూ గర్జించిన పన్నీర్.. పోయెస్ గార్డెన్ వేదనిలయం నుంచి శశికళను ప్రజలు తరిమికొడతారంటూ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.
2. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత.. ప్రీసీడియం ఛైర్మన్ గా ఉన్న మధుసూదనన్ పై చిన్నమ్మ వేటు వేశారు. ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. ఆయన స్థానంలో సెంగొట్టన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
3. తనపై చర్యలు తీసుకునే అధికారం శశికళ నటరాజన్ కు లేనే లేదని తేల్చేశారు అన్నాడీఎంకే సీనియర్ నేత మధుసూదనన్. తనను బహిష్కరిస్తున్నట్లు చెప్పటానికి శశికళ ఎవరన్న ఆయన.. తామే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవే లేదని.. పార్టీకి కొత్త ప్రధాన కార్యదర్శి పదవిని తాము త్వరలోనే ఎన్నిక నిర్వహిస్తామని.. ప్రధాన కార్యదర్శి ఎవరన్నది క్యాడర్ తేలుస్తుందన్నారు.
4. పోయెస్ గార్డెన్ ప్రజల ఆస్తిగా శశికళ వేటు వేసిన మధుసూదనన్ ఘాటు వ్యాఖ్య చేశారు. వేద నిలయంలో తిష్ట వేసిన వారిని వెళ్లగొట్టేందుకు రెండు రోజుల్లో అక్కడకు వెళ్లనున్నట్లుగా ప్రకటించారు.
5. గవర్నర్ తో భేటీ అయిన ప్రతిపక్ష నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా పాలనా యంత్రాంగం స్తంభించిపోయినట్లుగా పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందన్నారు. పన్నీర్ తిరుగుబాటు వెనుక డీఎంకే హస్తం ఉందన్న వ్యాఖ్యలపై స్పందించాల్సిన సమయం ఇది కాదన్నారు.
6. గవర్నర్ తో భేటీ అయిన స్టాలిన్.. పన్నీర్ కు మద్దతుగా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఆయన్నుసీఎంగా ఎంపిక చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
7. అన్నాడీఎంకే అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీకి తలపోటుగా మారింది. శశికళకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు తిరునావుక్కరనర్ మాటను మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తమిళ ప్రజల మద్దతు మొత్తం పన్నీర్ కు ఉంటే.. కాంగ్రెస్ శశికళకు మద్దతు పలకటం సబబు కాదని వారు చెబుతున్నారు. ఈ ఇష్యూపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు తిరునావుక్కరనర్ ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
8. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరింత భద్రత కోసం కేంద్రం నుంచి అదనపు దళాల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
9. ఎమ్మెల్యే కాని వ్యక్తిని క్యాబినెట్ సభ్యులుగా బాధ్యతలు తీసుకోవాలని భావించినప్పుడు సదరు వ్యక్తి.. ఆరునెలల వ్యవధిలో ఎన్నిక కావాల్సి ఉంటుంది. మరి.. శశికళ ను సీఎంగా బాద్యతలు అప్పగిస్తే.. ఆర్నెల్ల వ్యవధిలో ఆమె ఎన్నిక కాగలరా? అన్న అంశంపై గవర్నర్ దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో ఆయన పెద్దఎత్తున చర్యలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
10. తమ అధినాయకురాలు చిన్నమ్మకు గవర్నర్ నుంచి ఏ క్షణంలో అయినా పిలుపు రావొచ్చన్న ఆశాభావాన్ని ఆమె వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గవర్నర్ పిలుపుకోసమే తామంతా ఒకే చోట కలిసి ఉన్నట్లుగా శశికళకు బలమైన మద్దతుదారు రత్నస్వామి చెప్పారు. మరోవైపు.. చిన్నమ్మ క్యాంపు దగ్గర కాపు కాసిన మీడియా..రిసార్ట్స్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడున్న బౌన్సర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. మీడియాను లోపలకు వెళ్లేందుకుఅస్సలు అనుమతించకపోవటం గమనార్హం.