రాజకీయ నేతలు ఎన్నికలలో పోటీ చేసి గెలవడం ఒక ఎత్తు అయితే ... ఆ తరువాత పదవిని కాపాడుకోవడం రాజకీయనేతలకి పెద్ద సవాల్ వంటింది. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ప్రత్యర్థులు పదవి నుండి దించేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే రాజకీయనేతలకి తమ పదవి కాపాడుకోవడానికే సగంసమయం సరిపోతుంది అని అంటారు. రాజకీయాలలో ఏ నాయకుడికి ఎటునుండి ఏ సమస్య వస్తుందో ఎవ్వరం చెప్పలేము . అంతవరకూ అంతా బాగుంది అనుకున్న నాయకుడిపై కూడా రాత్రికి రాత్రి ఎదో ఒక సమస్య వచ్చిపడుతుంది.
మన దేశంలో ఎన్నికలలో పోటీ చేయాలనీ అనుకున్నవారెవరైనా కూడా మన దేశ పౌరులుగానే ఉండాలి. ఆలా కాకుండా ఇతర ఏ దేశంలో పౌరసత్వం ఉన్న మనదేశంలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తారు. ఒకవేళ అప్పటికే పోటీచేసి గెలుపొందినా కూడా ఉన్న పదవి ఉండిపోవడం మాత్రం పక్కా. ఇకపోతే తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం పై గతంలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి గెలిచిన చెన్నమనేనికి భారత పౌరసత్వం లేదంటూ ఆయన ప్రత్యర్థి బీజేపీ లీడర్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో అప్పటినుంచి వివాదం కొనసాగుతోంది. 2010 ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నుంచి తొలిసారి గెలుపొందిన రమేశ్ కు పౌరసత్వానికి సంబంధించి ఎక్కడా అనుకూలంగా తీర్పు రాలేదు. ఇక 2014లో మూడోసారి ఎన్నికైన చెన్నమనేని రమేశ్ పై బీజేపీ తరపున పోటీ చేసిన ఆది శ్రీనివాస్ మరోసారి ఫిర్యాదు చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.చెన్నమనేనికి భారత పౌరసత్వం రద్దు చేస్తూ అప్పట్లో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని అయన సవాల్ చేసి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. కానీ , తాజాగా మరోసారి అయన పౌరసత్వం పై కేంద్ర మంత్రిత్వ శాఖ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 31 లోపు ఢిల్లీ లో విచారణకి హాజరుకావాలని తెలిపింది. చూడాలి ఈసారైనా చెన్నమనేని పౌరసత్వం పై ఉత్కంఠ వీడిపోతుందేమో ..