కోదండ‌రాంకు పైత్యం ఎక్కువ!!

Update: 2017-02-21 06:55 GMT
ప్ర‌జాస్వామిక వాదులుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వంపై పోరాటం చేద్దామ‌ని సిద్ధ‌మైన కొంద‌రు తెలంగాణ ఉద్య‌మకారుల్లో చీలిక వ‌చ్చిన‌ట్లు వినిపించిన వార్త‌లు నిజ‌మ‌య్యాయి. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే వారిలో ముందున్న తెలంగాణ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై స‌హ‌చ‌ర ఉద్య‌మ కారులైన తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు చెరుకు సుధాకర్ - మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిప‌డ్డారు. కోదండ‌రాంకు పైత్యం ఎక్కువైందని, జేఏసీ కాస్త కేఏసీ-కోదండరాం యాక్షన్ కమిటీగా మారిందని ఆరోపించారు.

ఈ నెల 22న నిర్వహించాలనుకున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రొఫెసర్ కోదండరాం బలప్రదర్శన కాదని - నిరుద్యోగుల కడుపు మంట - బాధలను తెలియజేసే నిరసన ర్యాలీ అని తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన గద్దర్ - విమలక్క వంటి ఉద్యమకారులను ప్రొఫెసర్ కోదండరాం కలుపుకొని పోవడం లేదని, కేవలం ఆయ‌నొక్కడే నడిపిస్తున్నారని చెరుకు సుధాకర్ - యెన్నం శ్రీనివాస్ రెడ్డి  వారు విమర్శించారు. టీజేఏసీకి పండ్లు కాయడం లేదని - చెట్టు ఎండిపోయిందని - ఆ చెట్టు కట్టెలు పొయ్యిలోకి కూడా పనికి రావని వారు ధ్వజమెత్తారు. తమ తెలంగాణ ఉద్యమ కమిటీ వంటి ఉద్యమ సంస్థలు - ప్రజా సంఘాలు - వామపక్షాలను కలుపుకుని పోవడం లేదని వారు వాపోయారు. అయిన‌ప్ప‌టికీ తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు.

కాగా, నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో హైకోర్టుకు వెళ్ల‌గా తీర్పు మంగ‌ళ‌వారానికి పెండింగ్‌ లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. కోర్టులో వాదాన సంద‌ర్భంగా పోలీసు అధికారులు నగరంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ర్యాలీకి అనుమతిస్తే సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పైగా 10 వేలమంది మాత్రమే నగరానికి వస్తారని చెబుతున్నప్పటికీ, 30 వేలు దాటే అవకాశం ఉందని, దీంతో నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతాయని, తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్య మం తరహాలో ఉద్యమించాలన్న సంకేతాలు తమకు ఉన్నాయని తెలిపారు. నగర శివారులో అంటే సైబరాబాద్ పరిథిలో 3 ప్రాంతాలు - రాచకొండ కమిషనరేట్ పరిథిలో 3 ప్రాంతాల్లో ఎక్కడైనా ర్యాలీ నిర్వహణకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే మంగళవారం దీనిపై కోర్టులో విచారణ కొనసాగనున్నది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News