నిధులు మళ్లించిన కేసీఆర్.. ఈడీకి ఫిర్యాదు

Update: 2023-01-02 09:41 GMT
పుట్టెడు అప్పుల్లో ఉన్న కేసీఆర్ కు కేంద్రం పైసా ఇవ్వడం లేదు. అడిగినా కాలదన్నుతోంది. కేంద్రం చేతుల్లోని ఆర్బీఐ రూపాయి కూడా తెలంగాణకు అప్పు పుట్టనివ్వడం లేదు. దీంతో కేసీఆర్ ఏం చేస్తాడు.. కేంద్రం ఇచ్చి న నిధులనే వేరే వాటికి మళ్లిస్తూ పథకాలను రన్ చేస్తున్న పరిస్తితి నెలకొంది.

కేసీఆర్ సర్కార్ పథకాలకు బాగా వెచ్చించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. కేంద్రం గ్రామాలకు అందిస్తున్న నిధులను మళ్లించుకొని కొంతైనా గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరో పథకానికి సంబంధించిన నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించింది.

తాజాగా కేసీఆర్ సర్కార్ కేంద్రప్రభుత్వ నిధులతో అమలు అయ్యే గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మళ్లించేసింది. దీనిపై కేంద్ర బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల అవసరాలకు కల్లాల నిర్మాణానికి ఖర్చు చేయడం ఏంటని నోటీసలు జారీ చేసింది. సుమారు రూ.153 కోట్లు రికవరీ చేయాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది.

కేసీఆర్ సర్కార్ కలల పథకం 'హరితహారం' పథకానికి కూడా ఈ కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ నిధులను వాడినట్లు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.  హరితహారం ప్రారంభించిన 2017 నుంచి మూడేళ్లలో 1479 కోట్లు ఉపాధి నిధులను దీనికి మళ్లించింది కేసీఆర్ సర్కార్. ఇక 2014 నుంచి కేంద్రం నిధులు 5006.82 కోట్లను కేసీఆర్ సర్కార్ గ్రామీణ ఇతర పథకాలకు మళ్లించిందని తేలింది.

ఈ క్రమంలోనే హరితహారం పథకానికి గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులను వాడడంపై ఈడీకి ఫిర్యాదు అందింది. గ్రామీణ, ఉపాధి హామీ నిధులను హారితహారం పథకానికి వాడారని.. నిధుల డైవర్షన్ పై దర్యాప్తు జరపాలని ఈడీ అధికారులను కాంగ్రెస్నే బక్కజడ్సన్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్ సర్కార్ చిక్కుల్లో పడింది. దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News