గత కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న జమ్మూకాశ్శీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయూద్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 79 ఏళ్ల ముఫ్తీ మహ్మద్ కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.
పది రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించటంతో ఆయన్ను వెంటిలేటర్ల మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెడనొప్పి.. జ్వరంతో పాటు ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురైన ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. జమ్మూకాశ్శీర్ రాష్ట్రంలో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ముఫ్తీ మహ్మద్ మరణంతో ఆయన స్థానంలో.. ఆయన కుమార్తె ముఫ్తీ మెహబూబా సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. కాగా.. ముఫ్తీ మహ్మద్ మృతికి పలువురు ప్రముఖులు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.