రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్ ఒకే రకమైన ఐడియాలజీతో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక 2018 ఎన్నికల వేళ కేసీయార్ మీద పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు, ఎందుకంటే అప్పటికి ఆయన కేవలం నాలుగేళ్ల సీఎంగానే ఉన్నారు కాబట్టి. దాంతో టీయారెస్ కి మరో అవకాశం ఇద్దామని ప్రజలు నాడు అనుకున్నారు. ఆ ఎన్నికలకు ముందు రైతు బంధువు అన్న పధకం పెడితే తెలంగాణాలో ఉన్న భూస్వాములు అందరికీ డబ్బులు వచ్చాయి.
అలా కేసీయార్ రెండవమారు బంపర్ మెజారిటీతో గెలిచారు. దానికి విపక్షాల బలహీనత కూడా ఒక కారణంగా చెప్పాలి. కాంగ్రెస్ చివరి నిముషం దాకా సీట్ల విషయం ఎటూ తేల్చకపోవడం వల్ల కూడా టీయారెస్ కి అడ్వాంటేజ్ అయింది. ఇక టీయారెస్ కి అధికారం వచ్చిన తరువాత అనేకమంది కాంగ్రెస్ నాయకుకు టీయారెస్ లో చేరిపోయారు. ఇది జరిగిన ఎనిమిది నెలల తరువాత ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణాలో బీజేపీ టీయారెస్ ని దారుణంగా దెబ్బతీసింది.
దాంతో టీయారెస్ కి బాగా పట్టుకున్న కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ మూడు ఎంపీ సీట్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ ఎంపీ సీటులో కిషన్ రెడ్డి కూడా బీజేపీ తరఫున గెలిచారు. ఇక దక్షిణ తేలంగాణా విషయానికి వస్తే కాంగ్రెస్ లో గట్టి పట్టున్న ముగ్గురు రెడ్డి నాయకులు గెలిచారు. వారే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ముగ్గురూ కాంగ్రెస్ హై కమాండ్ కి బాగా సన్నిహితంగా ఉండే నాయకులు. ఇలా కనుక చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది నెలల తేడాలోనే తెలంగాణా ప్రజలు పెద్ద ఎత్తున దెబ్బ కొట్టారు.
ఇక ఏపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైసీపీకి ఒక చాన్స్ ఇద్దామని జనాలు డిసైడ్ అయ్యారు. అలా టీడీపీ ఓటు బ్యాంక్ గా ఉన్న బీసీలు, కమ్మలు కూడా వైసీపీ వైపుగా టర్న్ కావడంతో ఏకంగా నలభై శాతం ఓట్లు ఆ వైపు నుంచి వైసీపీకి వచ్చాయన్న మాట. ఇలా జగన్ వేవ్ లో భావి ముఖ్యమంత్రి అని అంతా పిలిచే లోకేష్ కూడా మంగళగిరిలో ఓడి మట్టికరచాడు.
ఇలా కనుక చూసుకుంటే 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా జనాలకు తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. కేవలం జగన్ పేరు తోనే ఆ ఎన్నికలు జరిగాయి. జగనే జనాలు ఓటు వేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే అతను కూడా ఓడిపోయాడు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీని జనసేన బాగా దెబ్బకొట్టింది. ఒకవేళ్ నాడు టీడీపీ జనసేన కలసి పోటీ చేసి ఉంటే రెండు పార్టీలు కలసి మరో 42 సీట్ల మీద ప్రభావం చూపించేవి. అయినా జగనే గెలిచేవాడు.
ఇక సీన్ కట్ చేస్తే 2023, 2024లో జరిగే తెలనగాణా ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. అందుకే తెలంగాణాలో టీయారెస్ బీజేపీని రెచ్చగొడుతున్నారు. వారికి ఎక్కువ ఓట్లు ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీ కాంగ్రెస్ కంటే టీయారెస్ ఓట్లు ఎక్కువగా చీలుస్తుంది. తెలంగాణాలో కాంగ్రెస్ చచ్చిపోయింది అనే విధంగా బీజేపీని బండి సంజయ్ ని టీయారెస్ నేతలు తిడుతున్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే బీజేపీకి తెలంగాణాలో ఉండేది మూడు నాలుగు శాతం ఓట్లు మాత్రమే.
మరో వైపు చూస్తే తెలంగాణాలో వంద నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా పోయాయి. అంతే కాదు బీజేపీకి బూత్ స్థాయి ఓటర్లు కూడా లేరు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలనాణా జిల్లాల్లో పది మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్ధులు బీజేపీకి ఉన్నారు తప్ప కమలానికి పెద్ద సీన్ లేదు అనే అంటారు. ఈ సంగతి తెలిసే టీయారెస్ బీజేపీని టార్గెట్ చేస్తోంది.
ఇదే ఫార్ములాతో ఏపీలోనూ రాజకీయ కధ సాగుతోంది. ఏపీలో వైసీపీ ఓట్లకు ఎక్కడ గండి పడుతుందో అని జనసేన మీద తెల్లారి లేస్తే వైసీపీ మంత్రులు మాటల దాడి చేస్తూ వస్తున్నారు. నిజానికి ఏపీలో అయిదారు శాతం ఉన్న జనసేనను మంత్రులు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏపీలో జనసేన చిన్న పార్టీయే కావచ్చు. సాలిడ్ గా నలభై శాతం ఓట్లు ఉన్న టీడీపీతో జత కడితే సులువుగా రెండు పార్టీలకు 47 నుంచి 48 శాతం ఓట్లు వస్తాయి. అపుడు అధికార వైసీపీకి ఇబ్బందికరంగా ఉంటుంది.
ఇక తటస్థ ఓటర్లు పది శాతం ఎటూ ఉంటారు. వారు గెలిచే పార్టీలకు ఓటేస్తారు కాబట్టి కచ్చితంగా ఈ కూటమి విన్ అవుతుంది అన్న అంచనాలు అయితే ఉన్నాయి. అందుకే ఏపీలో టీడీపీ జనసేన కలవవద్దు అనే వైసీపీ బలంగా కోరుకుంటోంది. కానీ నిజానికి చూస్తేఎ ఈ రెండు పార్టీలు కచ్చితంగా కలుస్తాయి అనే అంటున్నారు.
మొత్తం మీద చూస్తే అటు టీయారెస్ కానీ ఇటు వైసీపీ కానీ ఓట్లు బీజేపీని జనసేనను తమ రాజకీయ అవసరాల కోసం ప్రమోట్ చేస్తూ మరో వైపు గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు అని అనుకోవాలి. దీని వల్ల ఉన్న దాని కంటే లేనిది ఎక్కువగా ఫోకస్ అవుతోంది. ఇలా తమకు తమ రాజకీయ అవసరాలు, అధికారానికి ఓట్లకు గండి పడకుండా చూసుకోవడానికే ఈ రెండు పార్టీలను అటూ ఇటూ టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి టీయారెస్ అయినా వైసీపీ అయినా ఒకే ఆలోచనా విధానంతో పనిచేస్తున్నాయి అనే అంటున్నారు అంతా.