గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా అనేక డ్రగ్స్ అక్రమ రవాణా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుల్లో చాలా వరకు సినీ ప్రముఖులే ప్రధాన నిందితులుగా ఉన్నారు. బాలీవుడ్ లో బయటపడ్డ డ్రగ్స్ రాకెట్ లో చనిపోయిన ఒక యంగ్ హీరో పేరు వినిపించగా.. తాజాగా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఆరోపణలు వచ్చాయి. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ రాకెట్ కేసులో దాదాపు నెల రోజులు జైలు శిక్ష అనుభవించడం మనం చూశాం.
హైదరాబాద్ పోలీసులు తాజాగా మరో డ్రగ్ రాకెట్‌ను రట్టు చేశారు. ఈ రాకెట్ నిందితుల జాబితాలో పెద్ద పెద్ద ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. హైదరాబాద్ పోలీసులు నగరంలో పెద్ద డ్రగ్స్ రాకెట్‌ను పట్టుకున్నారు. పెడ్లర్లు ముంబైకి చెందిన వారని తెలుస్తోంది.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి పిల్లల పేర్లతో కూడిన 30 మంది డ్రగ్స్ వినియోగదారుల జాబితాను తయారు చేసినట్లు వినికిడి. పోలీసులు కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు. రాకెట్ గురించి మరిన్ని వివరాలను త్వరలో పోలీసు శాఖ ప్రకటించే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇప్పటికే డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. కొందరు ప్రముఖ టాలీవుడ్ ప్రముఖులు కూడా విచారణను ఎదుర్కొన్నారు. అదంతా సమిసిపోయిన మళ్లీ డ్రగ్స్ మూలాలు బయటపడడం కలకలం రేపుతోంది. తాజాగా పట్టుబడ్డ వారిలో ప్రముఖుల పిల్లలు ఉండడంతో వారు ఎవరా అన్న ఆసక్తి కలుగుతోంది. దీనిపై పోలీసుల నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అప్పుడే ఎవరనేది తేలనుంది.