'కాంతారా' మూవీపై చిలుకూరు ఆలయ పూజారి ట్వీట్ వైరల్

Update: 2022-10-23 07:15 GMT
కాంతారా మూవీపై చిలుకూరు ఆలయ పూజారి ట్వీట్ వైరల్
ఇటీవల కన్నడలో విడుదలైన 'కాంతారా' చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కన్నడలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లోకి కూడా డబ్ చేయబడింది. అన్ని మార్కెట్‌లలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్ చేస్తోంది.

కాంతార కథ.. కర్ణాటకలోని కుందపురా ప్రాంతంలో జరుపుకునే పురాతన గిరిజన పండుగ చుట్టూ తిరుగుతుంది. ప్రజలు ఆ పాయింట్‌కి కనెక్ట్ అయ్యారు. పురాతన హిందూ ధర్మానికి క్యారియర్‌గా ఈ చిత్రాన్ని జరుపుకుంటున్నారు. ఈ చిత్రం హిందుత్వాన్ని గొప్పగా ప్రచారం చేస్తుందని, హిందూ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రం అని చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ''దేవతలు తమకు ఇచ్చిన వాగ్దానాలను సీరియస్‌గా తీసుకుంటారని, వాటిని అమలు చేయాలని చూస్తారని, అమలు చేస్తారని, రాజ్యాంగబద్ధంగా కూడా అలా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని 'కాంతారా' ద్వారా కీలక సందేశాన్ని ఇచ్చారు' అని ఆలయ పూజారి పేర్కొన్నారు..

"363 ఆర్టికల్ హిందూ దేవత హక్కుల వివాదం, ధర్మ విజయంను సూచిస్తుంది. చివరికి దేవతలు తమకు ఇచ్చిన వాగ్దానాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.  వాటిని అమలు చేయాలి. రాజ్యాంగబద్ధంగా కూడా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేదే కాంతర చలనచిత్రం ముఖ్య సందేశానికి నిజమైన ఉదాహరణ. " అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాంతారా మూవీని స్వయంగా హీరో రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కూడా ఆయనే ప్రధాన హీరో. కాంతారాను హోంబలే ఫిలింస్ నిర్మించింది.

Tags:    

Similar News