ప్రపంచమంతా మహమ్మారి వైరస్ తో సతమతమవుతోంది. భారతదేశం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ సమయంలో ప్రజల ఆరోగ్యం కోసం పకడ్బందీ చర్యలు చేపడుతోది. అయితే ఇదే అదును చూసుకుని చైనా కవ్వింపు చర్యలకు తెర లేపింది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణానికి పాల్పడింది. రెండు వారాలుగా భారత సైన్యాన్ని చైనా రెచ్చగొడుతూ తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద భారీగా గస్తీ పెంచింది. లద్దాఖ్ ఈశాన్య ప్రాంతం దగ్గర మామూలుగా తిరిగే పెట్రోలింగ్ ని మూడింతలు చేసింది. దీంతో భారత్ కూడా పాంగాంగ్ సరస్సుకి పశ్చిమ ప్రాంతం వైపుగా నావికదళాన్ని భారీ స్థాయిలో మొహరించింది. మొత్తం 45 కిలోమీటర్ల మేర ఉన్న సరస్సు పరిధిలో భారత నావికదళం గస్తీని పెంచి.. చైనా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. మొదటి నుంచి చైనాది వక్రబుద్ధే. ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తనకు కావాల్సిన పని చేసుకునే ఉద్దేశంతో వివాదాలను పావుగా వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఏం ఆశించి ఈ విధంగా రెచ్చగొడుతుందో తెలుసుకుందాం.
లైన్ ఆఫ్ యాక్చువల్ వద్ద వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. అయితే చైనా ఎందుకు రెచ్చగొడుతోంది.. ఏమీ కారణాలు అని విశ్లేసిస్తే చాలానే ఉన్నాయి. నెల రోజులుగా చైనా వ్యవహార శైలిలో మార్పుకు కారణాలు తెలుస్తున్నాయి. వారం రోజులుగా లద్దాక్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు ఫింగర్ పాయింట్ల వద్ద చైనా ఉద్దేశపూర్వకంగా తన పరిధి దాటి మరీ భారత్ ని కవ్వించడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది.
1999లో భారత్ పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం చేస్తుండగా ఈలోపు చైనా గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ రోడ్డు నిర్మించుకుంది. ఈ రోడ్డు మార్గంతో వారికి భారీగా వాహనాలతో సహా గస్తీకి వీలు కలిగింది. ఇందుకే ఈ మధ్యనే భారత్ కూడా గాల్వాన్ ఏరియాలో రోడ్డు నిర్మించింది. దీనిపైన చైనా అక్కసు వెళ్లగక్కుతోంది. తమ భూభాగంలో నిర్మాణాలు చేపడుతుండడంతో భారత సైన్యాన్ని చైనా నిలువరిస్తోందని సమాచారం. చైనా నిర్మించుకున్న రహదారి బాగా ఇరుకైనది కావడంతో భారత్ అడ్డగిస్తే చైనా సైనికులు వారి వాహనాలు టర్న్ తీసుకుని వెళ్లడం కుదరదు. దీంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు పెరగడానికి కారణంగా పరిశీలకులు చెప్తుంటారు.
మహమ్మారి వైరస్ పుట్టింది చైనాలోనే. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా దూషిస్తోంది. విమర్శలు, ఆరోపణలు తీవ్రం చేయడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. చైనాలో పరిస్థితులు ప్రస్తుతం బాగా లేవు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కంపెనీలు, సంస్థలు అక్కడి నుంచి తరలివెళ్లేందుకు నిర్ణయించాయి. వాటిని భారతదేశం ఆహ్వానిస్తోంది. దీనికోసం భారతదేశం అన్ని రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. దీనిని చైనా అభ్యంతరం తెలిపింది. వైరస్ పుట్టుకపై చైనాలో విచారణ చేయాలని అమెరికా - ఇతర దేశాలతో పాటు భారత్ కూడా డిమాండ్ చేసింది. దీంతో చైనాకు మండింది. దానిపై ఆగ్రహంతో సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.