ఆ దేశంలో ట్రంప్‌ కు పిచ్చి క్రేజ్ పెరిగిపోయింది

Update: 2017-03-10 06:09 GMT
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్ త‌న విభిన్న‌మైన ఆలోచ‌న విధానంతో తీసుకునే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్త‌న్న సంగ‌తి తెలిసిందే. ఇలా ట్రంప్ సంపాదించిన పేరును క్యాష్ చేసుకోవ‌డంలో కూడా ఆయ‌న టీం ముందంజ‌లో ఉంది. ట్రంప్ అంటేనే కొన్ని దేశాలు ఇబ్బందిప‌డుతున్న ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న పేరుతో వ్యాపారం చేసేందుకు చైనాలో లైన్ క్లియ‌ర్ అయింది. చైనాలో పెద్ద ఎత్తున ఉన్న వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన 38 కొత్త ట్రేడ్‌ మార్కులకు చైనా ప్రభుత్వం ప్రాథమిక అనుమతి మంజూరు చేసింది. ఈ ట్రేడ్‌ మార్కుల్లో హోటళ్ల మొదలు గోల్ఫ్‌ క్లబ్‌ ల వరకూ, బాడీగార్డ్‌ సేవల మొదలు గృహ రక్షణ సేవల వరకూ ప్రతి ఒక్క అంశాన్ని కవర్‌ చేసే అంశాలున్నాయి.

ఈ ట్రేడ్‌ మార్కుల అనుమతికి చైనాలోని ట్రంప్‌ తరపు న్యాయవాదులు గత ఏడాది ఏప్రిల్‌ లో దరఖాస్తు చేశారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో చైనాకు వ్యతిరేకంగా ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు చేయటంతో ట్రేడ్‌ మార్కులకు అనుమతి లభించే అవకాశాలపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ చైనా ట్రేడ్‌ మార్క్‌ కార్యాలయం  ప్రొవిజనల్‌ అనుమతులను ఇస్తున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలేవీ రాకపోతే 90 రోజుల్లో ఈ అనుమతులను చైనా ప్రభుత్వం రిజిస్టర్‌ చేస్తుంది. ఇందులో మూడు తప్ప మిగిలినవన్నీ ట్రంప్‌ పేరిటే రిజిస్టర్‌ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News