నిజాన్ని దాచటం చైనాకి అలవాటే....1967లోనూ ఇలానే ..?

Update: 2020-06-17 11:50 GMT
సమకాలీన ప్రపంచంలో చైనా తమ ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగిస్తుంది అని మరోసారి నిరూపితమైంది. పాక్ లాంటి పేద దేశాలకు డబ్బును ఎరగా వేసి తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఆయా దేశాలపై ఆధిపత్యం సంపాదిస్తోంది. అయితే, ఇండియాపై ఆలా ఆధిపత్యం కొనసాగించాలంటే కుదరని పని అందుకే  బోర్డర్ లో ఘర్షణలకు దిగుతుంది.
తాజాగా  లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇండియా, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. 20 మంది భారత సైనికులు అమరులైయ్యారు.  

వైరస్ సమయంలో కూడా చైనా కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను దాచింది.   ప్రపంచానికి మహమ్మారి గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చింది. దీంతో వైరస్ ను లైట్ గా తీసుకున్నారు.  ఇటలీ, స్పెయిన్, అమెరికాలో కరోనా విధ్వంసం తరువాతగాని అర్ధం కాలేదు.  చైనా వాస్తవాలు దాచిపెట్టిందని. వైరస్ కేసుల విషయంలో మాత్రమే కాదు, ఇండియా చైనా మధ్య 1967లో రెండోసారి జరిగిన యుద్ధం సమయంలో చైనా సైనికుల మరణాల సంఖ్యనుదాచిపెట్టింది. 40 మంది వరకు భారతీయ సైనికులు మరణిస్తే, 500 మంది వరకు చైనా సైనికులు మరణించారు.  కానీ, ఈ విషయాన్ని  చైనా అధికారులు ఇప్పటి వరకు కూడా ధ్రువీకరించలేదు.  

ఇకపోతే , తాజాగా  జరిగిన గాల్వాన్ ఎటాక్ లో భారత సైనికులు 23 మంది మరణించగా, చైనా సైన్యం 43 మంది వరకు మరణించినట్టు స్పష్టమైన వార్తలు వస్తున్నాయి.  కానీ, చైనా మాత్రం ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. కాగా, లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇండియా, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో... చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News