అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా అణ్వస్త్ర క్షిపణుల సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆరోపించింది. అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ అధిపతి అడ్మిరల్ చార్లెస్ రిచర్డ్ ఈ మేరకు సంచలన ఆరోపణలు చేశారు. యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా.. ఏ స్తాయికి అయినా తీసుకెళ్లగలిగే సామర్థ్యాలు చైనా, రష్యాలకు ఉన్నాయని హెచ్చరించాయి.
అమెరికాకు ముప్పు ఉండదు అని చెప్పగల వెసులుబాటు లేదని చార్లెస్ రిచర్డ్ పేర్కొన్నారు. బీజింగ్ పశ్చిమ చైనాలో రహస్య ప్రాంతాల్లో అణు క్షిపణులను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 120 చోట్ల బొరియల్లో వీటిని సిద్ధం చేసిందని ఆరోపించారు. ప్రతి బొరియలోని క్షిపణికి అమెరికాను తాకే సామర్థ్యం ఉందని వెల్లడించింది. దీనికి తోడు చైనా ఇప్పటికే భూమిపై భారీ సంఖ్యలో యారే రాడార్ల ఏర్పాటుతోపాటు జియో స్టేషనరీ శాటిలైట్లను కూడా మోహరించి నిఘా ఉంచిందన్నారు. ఇవి బాలిస్టిక్ క్షిపణలును గమనించగలవని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అడ్మిరల్ రిచర్డ్స్ రక్షణ శాఖ అంచనాల కమిటీతో అభిప్రాయపడ్డారు.
గత ఏడాది చైనా హైపర్ సోనిక్ ఆయుధాన్ని ఓ రాకెట్ పై ఉంచి ప్రయోగించడం అమెరికాకు కలవరపాటుకు గురిచేసింది. దీంతో పాటు డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ను కూడా పరీక్షించింది. చైనా భారీ ఎత్తున క్షిపణి రక్షణ వ్యవస్థలు, యాంటీ శాటిలైట్, యాంటి మిసైల్, యాంటీ డ్రోన్ టెక్నాలజీలను సైన్యంలోకి తీసుకొచ్చేందుకు పెట్టుబడి పెడుతోంది.
చైనా పశ్చిమ సరిహద్దుల్లో క్షిపణి బొరియలు నిర్మించడం నిజంగానే భారత్ ను ఆందోళన పరిచే అంశంగా చెప్పొచ్చు. అమెరికా అణుభయం చైనాపై పనిచేయకపోతే.. ఆ దేశాన్ని అడ్డుకోవడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ కలిసి పనిచేయాలి’ అని అమెరికా అధికారి అభిప్రాయపడ్డారు.