చైనా వ్యూహాన్ని చెబుతున్న 'అమెరికా'

Update: 2017-07-12 05:33 GMT
గ‌డిచిన కొద్ది రోజులుగా చైనా.. భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న తీవ్ర ఉద్రిక్త‌త‌ల సంగ‌తి తెలిసిందే. భూటాన్ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన డోక్లాంను త‌న అధీనంలోకి తీసుకోవ‌టం ద్వారా భార‌త్‌ను దెబ్బ తీసే భారీ వ్యూహానికి తెర తీసిన చైనా.. అందులో భాగంగా మ‌రో వ్యూహాన్ని ఎంచుకున్న‌ట్లుగా చెబుతున్నారు. డోక్లామ్ ప్రాంతంలో భార‌త సైనికుల‌పై చైనా సైనిక చ‌ర్య‌ల‌న్నీ వ్యూహాత్మ‌కమ‌ని చెబుతున్నారు. ఓ పెద్ద దుర్బుద్ధితోనే చైనా ఈ త‌ర‌హా ప‌నుల‌కు పాల్ప‌డుతోంద‌ని అమెరికా నిపుణులు చెబుతున్నారు.

వాస్త‌వాధీన రేఖ‌కు సంబంధించి య‌థాత‌థ స్థితిలో అంగుళం.. అంగుళం చొప్పు మార్పులు చేయ‌ట‌మే చైనా ఓవ‌రాల్ ల‌క్ష్యంగా భావిస్తున్నారు. స‌లామీ స్లైసింగ్ ఎత్తుగ‌డ‌ను చైనా అనుస‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. వివాదాస్ప‌ద ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఎలా అయితే దుర్మార్గాన్ని ప్ర‌ద‌ర్శించిందో ఇంచుమించు అదే వ్యూహాన్ని డోక్లాం ప్రాంతంలో అమ‌లు చేయాల‌న్న‌దే చైనా ఆలోచ‌న‌ట‌. కొద్దికొద్దిగా స‌రిహ‌ద్దుల్ని మార్పులు చేయ‌టం ద్వారా..ఒక నాటికి భారీ ప్ర‌యోజ‌నాన్ని చైనా పొందాల‌ని భావిస్తోంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే... స‌రిహ‌ద్దు వివాదాన్ని భార‌త్‌.. చైనాలు అహింసా ప‌ద్ధ‌తిలో ప‌రిష్కార మార్గాన్ని క‌నుగొంటాయ‌న్న అభిప్రాయాన్ని జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ అంత‌ర్జాతీయ సంబంధాల ప్రొఫెస‌ర్ మార్కే చెబుతున్నారు. త‌మ‌ను బ‌ల‌హీనులుగా ఎవ‌రూ ప‌రిగ‌ణించ‌కూడ‌ద‌న్న‌ది భార‌త్‌.. చైనాల ఉద్దేశంగా క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కార‌ణంతో స‌రిహ‌ద్దుల్లో త‌ర‌చూ వివాదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.ఇలాంటి ప‌రిస్థితి కార‌ణంగా రాను రాను.. ఈ వివాదాల్ని చ‌ల్లార్చ‌టం క‌ష్టంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ వివాదాల కార‌ణంగా భ‌విష్య‌త్తులో భార‌త్‌.. చైనాల  మ‌ధ్య యుద్ధం జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న మాట‌ను 2015లోనే ఒక ప‌త్రంలో మార్కే పేర్కొన‌టం గ‌మ‌నార్హం. యుద్ధాన్ని నివారించాల్సిన బాధ్య‌త అమెరికాకు ఉంద‌న్న ఆయ‌న‌.. ఒక‌వేళ చైనాకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌టం కానీ.. త‌ట‌స్థంగా కానీ ఉంటే భార‌త్ - అమెరికా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి విఘాతం క‌లుగుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఇక‌.. ప్ర‌స్తుతం భార‌త్ .. చైనాల మ‌ధ్య నెల‌కొన్న సైనిక ప్ర‌తిష్టంభ‌న శీతాకాలం వ‌ర‌కూ సాగుతుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం తాను మొహ‌రించిన ప్రాంతం నుంచి త‌న ద‌ళాల్ని వెన‌క్కి పంపే ఉద్దేశం భార‌త్‌కు లేక‌పోవ‌ట‌మే దీనికి కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం భార‌త్ చాలా అనుకూల స్థితిలో ఉంద‌ని.. చైనా బెదిరింపుల‌కు లొంగేది లేమ‌న్న సంకేతాల్ని ఇస్తోంది. భూటాన్‌లోకి వ‌చ్చిన చైనా.. రోడ్డు నిర్మాణానికి పూనుకున్న‌ప్పుడు భార‌త్ దాన్ని వ్య‌తిరేకిస్తుంద‌ని ఆ దేశం అస్స‌లు అనుకోలేద‌ని సెంట‌ర్ ఫ‌ర్ చైనా అనాల‌సిస్ అండ్ స్ట్రాట‌జీ జ‌య‌దేవ ర‌ణ‌దే వెల్ల‌డించారు. మ‌రోవైపు భార‌త్‌.. చైనాల మ‌ధ్య సంబంధాల్లో వ‌స్తున్న మార్పు ఆసియా మీద‌నే కాదు.. ఆసియా ప‌సిఫిక్ పైనా ప‌డుతుంద‌ని.. అంతిమంగా ప్ర‌పంచం మొత్త‌మ్మీదా ప‌డ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News