ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థ. అమెరికన్లు తమ మేథో సంపత్తిని కరిగించి యాపిల్ స్మార్ట్ ఫోన్లు - ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు పురుడు పోశారు. అయితే ఈ అద్భుత టెక్నాలజీని అమెరికా తయారు చేసినా దాన్ని వినియోగించుకుంటోంది మాత్రం చైనానే.. అమెరికా కంపెనీలు - దేశం చేసిన పొరపాటే ఇప్పుడు చైనా పాలిట వరంగా మారింది. చైనా దేశం ఆర్థికంగా - టెక్నాలజీలో ఎదిగేలా చేసింది.
యాపిల్ సంస్థ ఎంత గొప్ప ఆవిష్కరణ చేసినా వాడి విడిభాగాలు - స్మార్ట్ ఫోన్లు తయారు చేసేది చైనానే. చైనాలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న చవక మానవ వనరులను చూసి అమెరికన్ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ ఉత్పత్తుల విడిభాగాల తయారీని చైనా కు అప్పగించాయి. దీంతో యాపిల్ సహా అందరి టెక్నాలజీని కాపీ చేసిన చైనీయులు వివో - ఒప్పో సహా విభిన్నమైన కంపెనీలు స్థాపించి చవకగా ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందిస్తూ ఇప్పుడు యాపిల్ లాంటి కంపెనీలకే ఎసరు పెడుతున్నారట. ఇక స్మార్ట్ పోన్లే కాదు.. కంప్యూటర్లు - ల్యాప్ టాప్ లు - స్మార్ట్ వాచీలు ఇలా అమెరికన్లు తయారు చేసిన టెక్నాలజీని చైనాలో తయారు చేయడం వల్ల ఈ అద్భుతమైన టెక్నాలజీ అంతా చైనీయుల పరమైపోయింది. ఇప్పుడు వారు సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసి చవకగా ఉత్పత్తి చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు గండికొడుతున్నారని అమెరికన్ మార్కెట్ అనలిస్టులు వాపోతున్నారు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ కూడా ఇదే వ్యక్తపరిచాయి..అమెరికా మేథో సంపదను హక్కులను కొల్లగొట్టేలా పూర్వం అమెరికాకు అధ్యక్షులుగా చేసిన వారు చైనాకు అనుమతించారు. ఆ టెక్నాలజీ - సొమ్ముతోనే చైనా ఇప్పుడు సైనిక బలాన్ని పెంచుకుంటూ ప్రపంచానికే ముప్పుగా పరిణమించింది. అమెరికా సొమ్ముతోనే చైనా లాభపడింది. అందుకే తాను చైనాను దూరంగా పెట్టాను అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
ఇలా గత అమెరికా అధ్యక్షులు చైనాను ప్రోత్సహించడం.. కంపెనీలన్నీ తమ మేథో సంపత్తి ఉత్పత్తులను చైనాలో తయారు చేయించడంతో అమెరికా టెక్నాలజీ చైనా కాపీ కొట్టేసింది. ఇప్పుడు అమెరికా ఆర్థికాన్నే దెబ్బతీస్తోందట.. సైనిక శక్తిగా మారి ప్రపంచ పెద్దన్నగా మారేందుకు చైనా ఉబలాటపడుతోందట.. ఇదే చైనాపై ట్రంప్ కోపానికి కారణంగా చెబుతున్నారు.