మానవ హక్కుల ఉల్లంఘన చైనాలో జరిగినట్టు మరెక్కడా జరగదని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా జిన్ పింగ్ అధ్యక్షుడు అయ్యాక అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందనే విమర్శలు ఉన్నాయి. జిన్ పింగ్ దెబ్బకు అలీబాబా, తదితర దిగ్గజ సంస్థలే బిచాణా ఎత్తేశాయని వార్తలు కూడా వచ్చాయి. బిలియనీర్లకే చుక్కలు చూపించిన జిన్ పింగ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ దేశ ప్రజలకు అంతేస్థాయిలో చుక్కలు చూపిస్తోందనే వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. చైనాలో కొన్ని బ్యాంకులు ఏప్రిల్ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి. ముఖ్యంగా హెనన్ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. వారి ఖాతాలను స్తంభింపజేశాయి. దీంతో బ్యాంకుల ఖాతాదారుల రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ బ్యాంకుల స్కామ్‌కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా బ్యాంక్ ఖాతాదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఖాతాదారుల నిరసనలు పెను ఉద్యమంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలను నిలువరించేందుకు జిన్ పింగ్ ప్రభుత్వం సొంత ప్రజలపైనే యుద్ధ ట్యాంకర్లను దించడం తీవ్ర విమర్శలపాలవుతోంది.
కాగా బ్యాంకుల మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశంతోనే యుద్ధ ట్యాంకర్లను రంగంలో దించామని జిన్ పింగ్ ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్లు బ్యాంకుల వద్ద మోహరించాయి. యుద్ధ ట్యాంకర్లతో నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బుల్ని ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా యుద్ధ ట్యాంకర్లను దించడంతో అందరిలో 1989 నాటి టియానన్‌మెన్ స్క్వేర్ మారణహోమం గుర్తుకు వస్తోంది. ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు చైనా రాజధాని బీజింగ్‌లోని టియానన్‌మెన్ స్క్వేర్ వద్ద నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి పంపేయడానికి చైనా ప్రభుత్వం భారీగా ఆర్మీని రంగంలోకి దించింది. ఈ మారణ హోమంలో వేల మంది ప్రజలు మరణించారు.
వాళ్లకు స్మారకంగా.. అక్కడొక స్థూపాన్ని సైతం నిర్మించేందుకు చైనా అనుమతించలేదు. ఇప్పుడు తాజాగా యుద్ధ ట్యాంకర్లను దించడాన్ని 1989 నాటి టియానన్మెన్ స్వ్కేర్ మారణహోమంతో పోలుస్తున్నారు.