కరోనా వేళ భారత్ కు సాయానికి చైనా రెఢీ ఎందుకంటే?

Update: 2020-03-24 07:02 GMT
మీరు ఒకరికి సాయం చేస్తే.. ఆ సాయానికి సంబంధించిన ఫలితాన్ని ఏదో రోజు పొందుతామన్న మాట వింటుంటాం. ఇప్పుడు వాస్తవంలోకి వచ్చిందని చెప్పాలి. కరోనాతో కకావికలమైన చైనాకు దన్నుగా నిలవటం.. ఆ సంక్షోభ సమయంలో తాము అండగా ఉంటామంటూ ముందుకొచ్చిన మోడీ సర్కారు.. మాటలే కాదు.. చేతల్లోనూ భారీ సాయాన్ని అందించింది.

కరోనా కష్టకాలంలో ఉన్న చైనాకు అవసరమైన మాస్కులు.. చేతి తొడుగులు.. అత్యవసర మెడిసిన్లు.. వైద్య పరిఖాలతోకూడిన పదిహేను టన్నుల సామాగ్రిని చైనాకు పంపింది. చైనా నుంచి ఎలాంటి అభ్యర్థన రాక ముందే తనకు తాను స్పందించిన మోడీ సర్కారు చైనాకు సాయాన్ని పంపింది. తాము కష్టంలో ఉన్నప్పుడు తమకు తాముగా స్పందించిన భారత్ ను ఆదుకోవాల్సిన అవసరం తమపై ఉందని చెబుతోంది చైనా.

తాము కష్టంలో ఉన్న వేళలో ప్రధాని మోడీ.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ లు లేఖలు.. ఫోన్లు చేసి తమకు మద్దతుగా నిలిచారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జంగ్ షుయాంగ్ గుర్తు చేయటం గమనార్హం. తాము ఇబ్బందుల్లో ఉన్న వేళ తమకు సాయం చేసిన భారత్ తో పాటు.. మరో 18 దేశాలకు తామిప్పుడు సాయం చేస్తామని చెప్పారు. అందుకే అంటారు.. చేసిన మంచి ఊరికే పోదని.


Tags:    

Similar News