కరోనాపై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించిన చైనా

Update: 2020-02-18 09:45 GMT
చైనా తో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. చలికాలం వస్తుండడంతో దీని ప్రభావం కొద్ది రోజుల్లో తగ్గనుందని చైనా చల్లటి కబురు తెలిపింది. ఇన్నాళ్లు చలి తీవ్రంగా ఉండడంతో వైరస్ వ్యాప్తికి దోహదమైందని, ఇప్పుడు వేసవి వస్తుండడంతో ఈ వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ప్రకటించింది. ఇంకా ఈ వైరస్ బారిన పడిన వారిలో ముఖ్యంగా వృద్ధులు మరణించే అవకాశం ఉందని వెల్లడించింది. కరోనా వైరస్ పై మంగళవారం ఆ దేశం ఓ నివేదికను విడుదల చేసింది. 'చైనీస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సీసీడీసీ) కరోనాపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇప్పటి వరకూ నమోదైన 7 వేల కేసుల్లో 80 శాతం మందిలో ప్రాథమిక దశ లక్షణాలున్నాయని, వీరిలో వృద్ధులు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో వైద్య సిబ్బంది కూడా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరణాల రేటు 2.3% ఉండగా కరోనా వైరస్‌కు అత్యంత ప్రభావితమైన హుబేలో మరణాల రేటు 2.9% ఉందని, మిగిలిన చైనా దేశం మొత్తం మీద 0.4% ఉందని వివరించింది. అయితే ఈ వైరస్ బారిన పడిన మంగళవారం వరకూ 1,868 మంది మరణించారని, 72,436 మంది ఇన్ఫెక్షన్ బారినపడ్డారని చైనా ప్రకటించింది.

ఒక్క సోమవారం 98 మంది చనిపోగా, 1,886 కొత్త కేసులు నమోదయ్యాయని, వీటిలో 93 మరణాలు, 1,807 కేసులు ఒక్క హుబే ప్రాంతంలోనే నమోదవడం గమనార్హం. అయితే ఈ వైరస్ నుంచి 12,000 మందికి పైగా బాధితులు కోలుకోవడం సంతోషించే విషయం. అయితే ఈ వైరస్ బారిన పడిన 80 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో మరణాల రేటు అత్యధికంగా 14.8 శాతంగా ఉంది. చైనాలో ఫిబ్రవరి 11వ తేదీ వరకు నిర్ధారించిన, అనుమానిత, గుర్తించిన, ఎలాంటి లక్షణాలు చూపించని మొత్తం 72,314 కోవిడ్-19 కేసులను పరిశీలించినట్లు తెలిపారు.

ఇప్పటి వరకూ భావిస్తున్న వైరస్ లక్షణాలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రక్రియలను పరిశీలించగా చైనా వ్యాప్తంగా నమోదైన 44,672 కేసులకు సంబంధించి వివరాల సవివరింగా చైనా ప్రకటించింది.

- వీటిలో 80.9% ఇన్ఫెక్షన్ కేసులు ప్రాథమికమైనవిగా, 13.8% తీవ్రమైనవిగా, కేవలం 4.7% మాత్రమే అత్యంత తీవ్రమైనవిగా గుర్తించారు.
- 80 ఏళ్లు దాన వృద్ధుల్లో మరణాల రేటు (14.8%) ఎక్కువగా ఉంది.
- అయితే ఈ కేసుల్లో 9 ఏళ్ల లోపు చిన్నారులు ఎవరూ మరణించలేదు. 9 నుంచి 39 ఏళ్ల మధ్యలో మరణాల రేటు 0.2% ఉంది.
- లింగ నిష్పత్తి ప్రకారం చూస్తే, పురుషుల్లో మరణాల రేటు (2.8%) స్త్రీలు (1.7%) కన్నా ఎక్కువగా ఉంది.

వీరికి అత్యంత ప్రమాదం
అప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారు కోవిడ్-19 వ్యాపిస్తే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. కార్డియోవాస్కులర్ డిసీజ్‌ తో బాధ పడేవారు, డయాబెటిక్ రోగులు, దీర్ఘకాల శ్వాస సమస్యలున్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదిక లో వెల్లడించారు.

హర్షించే విషయం
జనవరి 23-26 మధ్యలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 వరకూ అది తగ్గుతూ వస్తోంది. కొన్ని నగరాలను పూర్తిగా మూసి ఉంచడం, ముఖ్యమైన సమాచారాన్ని వేర్వేరు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం, రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను తరలించడం తదితర ముందస్తు చర్యలు తీసుకోవడం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.




Tags:    

Similar News