పొరుగున ఉన్నప్పటికీ సఖ్యంగా ఉండటం కంటే సమస్యలు సృష్టించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే చైనా మరోసారి హద్దు దాటింది. ఆ దేశానికి చెందిన ఓ హెలికాప్టన్ భారత్ గగనతలంలోకి అక్రమంగా చొరబడింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ ప్రాంతంలో ఉన్న ఇండియా- చైనా బోర్డర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చమోలీ ఎస్పీ తృప్తి భట్ వెల్లడించారు.
టిబెట్ నుంచి శనివారం ఉదయం 9.14 గంటల ప్రాంతంలోని వచ్చిన హెలికాప్టర్.. బారాహోతి గగనతలంలో నాలుగు నిమిషాల పాటు చెక్కర్లు కొట్టి తిరిగి వెళ్లిపోయినట్లు ఆమె చెప్పారు. అయితే కచ్చితంగా అది చైనీస్ హెలికాప్టరేనా అన్నది ఆమె ధృవీకరించలేదు. చమోలీ ప్రాంతంలో భారత గగనతలాన్ని గతంలోనూ చైనా ఉల్లంఘించిన ఘటనలు ఉన్నాయి. ఆ హెలికాప్టర్ ఆర్మీకి సంబంధించి మాత్రం కాదని తృప్తి భట్ స్పష్టంచేశారు. అయితే, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రావడం కచ్చితంగా మన గగనతలాన్ని ఉల్లంగించడమే అవుతుందని ఆమె తెలిపారు. ఇండోటిబెటెన్ బోర్డర్ పోలీస్ కు కూడా ఈ విషయం తెలుసని ఆమె చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/