భారతీయుల్ని కాల్చి పారేస్తానన్న స్లోగన్ తో చైనా కంపెనీ ఆరాచకం

Update: 2021-09-25 05:30 GMT
కారణం లేకుండా ఆసూయ ద్వేషాల్ని పెంచుకోవటం కొందరు చేస్తుంటారు. భారత్ మీద చైనా కోపం కూడా ఈ కోవకు చెందిందే. మన దారిన మనం బతుకుతున్నా.. ఏదోలా గిల్లి మరీ గొడవ పడే చైనా తీరుకు తగ్గట్లే.. ఆ దేశానికి చెందిన కంపెనీ తీరుకూడా ఇంచుమించు అలానే ఉంది. వస్త్ర వ్యాపారంలో ఉన్న ఈ చైనా సంస్థకు భారతీయులు చుక్కలు చూపించాల్సిన అవసరం వచ్చింది.

భారతీయులంటే చైనీయుల్లో కొందరికి ఇంత ద్వేషమా? అన్న భావన కలిగేలా చేసే ఈ ఉదంతంలోకి వెళితే.. చైనాకు చెందిన ‘‘జేఎన్ బీవై’’ అనే దుస్తుల కంపెనీ ఒకటి ఉంది. తాజాగా సదరుకంపెనీ తాను తయారు చేసిన దుస్తుల మీద భారత్ మీద తనకున్న ద్వేషాన్ని బాహాటంగా ప్రదర్శించింది. ఇంగ్లిషులో ఉన్న ఈ ద్వేషాన్ని.. ఇంగ్లిషు వచ్చిన ఒక చైనా మహిళ ఈ బ్రాండ్ బట్టల మీద ఉన్న క్యాప్షన్ చూసి షాక్ కు గురైంది.

భారతీయులపై ద్వేషాన్నినింపేలా చిన్న పిల్లల దుస్తులపై వివాదాస్పద రీతిలో ప్రింట్లు ఉన్న బట్టల్ని ఒక చైనా మహిళ చూశారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన నాలుగేళ్ల కొడుకు కోసం ఫ్యామిలీ సభ్యులు కొందరు కొన్ని దుస్తుల్ని తీసుకొచ్చారని.. అందులో ఒక టీ షర్టుపై ఉన్న క్యాప్షన్ ను చదివాక ఆమె నోటి వెంట మాట రాని పరిస్థితి. ఎందుకంటే అందులో.. ‘‘ఈ ప్రాంతమంతా భారతీయులతో నిండిపోయింది. పిస్టల్ తీసుకొని వీళ్లందరినీ కాల్చి పడేస్తా’ అంటూ ఉంది.

తనకు చైనీస్ తోపాటు.. ఇంగ్లిషు రావటం వల్ల పిల్లల దుస్తుల మీద ఉన్నదేమిటో తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ‘నాలుగేళ్ల పిల్లాడు ఇలాంటి అర్థం వచ్చే టీషర్టులు ధరించటమా?’ అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. నాలుగేళ్ల పిల్లాడు ఈ తరహా టీ షర్టులు ధరించటం అంటేనే భయమేస్తుందన్న ఆమె.. తన ఆవేదనను..ఆగ్రహాన్ని కంపెనీకి కంప్లైంట్ చేశారు.

దీనిపై సదరు కంపెనీ స్పందించింది. టీ షర్టులపై ప్రింట్ చేసిన క్యాప్షన్లకు సారీ చెప్పిందే కానీ.. బట్టలపై సదరు క్యాప్షన్ ఎలా ప్రింట్ అయ్యాయయన్న విషయాన్ని మాత్రం ఓపెన్ కాకపోవటం గమనార్హం. భారతీయుల్నికించపరిచేలా ఉన్న క్యాప్షన్ గురించి సరైన వివరణ ఇవ్వకుండా బలుపు ప్రదర్శించిన ఈ చైనా కంపెనీకి దిమ్మ తిరిగేలా చేయాలన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News