ఇవాంక ఇప్పుడు అక్క‌డ సో హాట్‌

Update: 2017-03-05 10:45 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కూతురు ఇవాంక ఇపుడు చైనాల్ హాట్ టాపిక్ అయ్యారు. ఆమె పేరుకు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు వంద‌ల‌కొద్ది కంపెనీలు క్యూలో ఉన్నాయి. అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే...ట్రంప్ తెలిసినట్లుగా ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌ చైనీయులకు పెద్దగా తెలియదు. అయిన‌ప్ప‌టికీ పలు చైనా కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులకు ఇవాంక పేరుతో లేదా అలా వినిపించే పేర్లతో ట్రేడ్‌ మార్క్‌ ల కోసం తెగ ఆరాటపడుతున్నాయి!

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇవాంక ట్రేడ్‌ మార్క్‌ కోసం చైనా కంపెనీలు బాగా ప్రయత్నిస్తున్నట్లు చైనా ట్రేడ్‌ మార్క్‌ కార్యాలయం రికార్డ్స్‌ ద్వారా వెల్లడైంది. గత ఏడాది నవంబరు 10 నుంచి డిసెంబరు చివరి వరకు ఇవాంక - ఇవాంక ట్రంప్‌ - అలాగే ధ్వనించే రకరకాల పేర్లతో ట్రేడ్‌ మార్క్‌ల కోసం 258 దరఖాస్తులు వచ్చాయట. అయితే వీటిల్లో ఏ ఒక్క కంపెనీకి కూడా ఇవాంక ట్రంప్‌ తో నేరుగా వ్యాపార సంబంధాలు లేకపోవడం గమనార్హం. కానీ చాలా కంపెనీలు ఇవాంక ఫేమ్‌ ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా...ప్రవాసులపై పెరుగుతున్న దాడులను పట్టించుకోకుండా వలసదారుల నుంచి అమెరికన్లపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా బాధితులను ఆదుకోవడానికి వాయిస్ (విక్టిమ్స్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ క్రైమ్ ఎంగేజ్‌ మెంట్) పేరిట కొత్త కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని అంతర్గత రక్షణ విభాగాన్ని ఆదేశించారు. శరణార్థుల నుంచి అమెరికన్లు దాడులకు గురవుతున్నా, మీడియా ఉద్దేశపూర్వకంగా, ప్రత్యేక ప్రయోజనాల కోసం విస్మరిస్తున్నది అని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News