ఊహించని ఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. నిండా పద్దెనిమిదేళ్లు కూడా లేని ఒక క్రీడాకారిణి వ్యవహరం సంచలనం సృష్టించటమే కాదు.. పెద్ద చర్చగా మారింది. స్టేడియంలో జన్మనిచ్చిన ఆమె.. అదేమీ పట్టనట్లుగా.. అప్పుడే పుట్టిన పసిగుడ్డును పక్కన పడేసి తన దారిన తాను వచ్చేయటం. షాకింగ్ గా మారింది. షాకింగ్ గా అనిపించే ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
చైనా రాజధాని బీజింగ్ లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి చాంగ్ స్ కింగ్ సిటీలో అండర్ 18 వాలీబాల్ చాంఫియన్ షిప్ జరిగింది. ఈ మ్యాచ్ కు వచ్చిన ఒక జట్టుకు క్రీడాకారిణి అయిన జిమ్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చింది. వాస్తవానికి ఆమె ఆట ఆడాల్సి ఉన్నా.. గర్భవతి కారణంగా ఆమె ఆడకుండా.. ఆటను రికార్డు చేస్తుంది. ఇంతలో ఉన్నట్లుండి ఆమె టాయిలెట్ వైపు హడావుడిగా వెళ్లింది.
అక్కడ బిడ్డకు జన్మనిచ్చిన జిమ్.. అప్పుడే పుట్టిన శిశువును పొదల్లో పడేసి తిరిగి తనకు తెలీనట్లుగా వచ్చేసి ఆటను రికార్డు చేయటం మొదలెట్టింది. అయితే.. టాయిలెట్ కు వెళ్లిన వారు.. అక్కడ రక్తపు మడుగు చూసి.. ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన అక్కడి అధికారులు అప్పుడే పుట్టిన పసికందును.. తల్లిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. చైనాలో పెళ్లి కాకుండా పిల్లల్ని కనటాన్ని నేరంగా పరిగణిస్తారు. అందుకే.. జిమ్ అలాంటి పని చేసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.