ఇదెక్కడి శాడిస్ట్ భాగోతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. విషయం మొత్తం చదివిన తర్వాత మీరు కూడా అంతేలా ఎంజాయ్ చేయటమే కాదు.. మీ పిల్లలు చదువుకునే స్కూల్లోనూ ఇలాంటి శిక్ష వేస్తే ఎంత బాగుండని ఫీల్ కావటం ఖాయం. ఇవాల్టి రోజున పిల్లల్ని ఒక్క మాట అంటే ఊరుకోని పేరెంట్స్ ఉన్న వేళ.. పనిష్మెంట్ కు పండగ ఏమిటని డౌట్ రావొచ్చు. కానీ.. మొత్తం చదివితే మీ మనసు కచ్ఛితంగా మారటం ఖాయం. ఇంతకీ ఈ విచిత్రమైన ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటే..
చైనాలోని ఓ సెకండరీ స్కూల్లోని విద్యార్థులు అదే పనిగా సెల్ ఫోన్లు తీసుకొస్తున్నారట. ఎంత కంట్రోల్ చేసినా అస్సలు మాట వినటం లేదు. విచ్చలవిడిగా ఫోన్లు వాడేయటంతో స్కూల్ యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. విద్యార్థుల ఫోన్ల రచ్చకు చెక్ పెట్టాలని డిసైడ్ అయిన స్కూల్ యాజమాన్యం విద్యార్థుల దగ్గరున్న ఫోన్లను బలవంతంగా లాగేసుకుంది.
ఆ తర్వాత విద్యార్థుల్ని ప్లే గౌండ్ర్ లో వరుసగా కూర్చోబెట్టేశారు. వారి ఎదుటే.. విద్యార్థుల ఫోన్లు ఒక్కొక్కటి పగలకొట్టేశారు. ఒక్క మాట అనకుండా.. ఒక్క దెబ్బ కొట్టకుండా విద్యార్థుల సెల్ ఫోన్లను పగలకొట్టేయటం ద్వారా భారీ శిక్షను వేయటంపై పిల్లల తల్లిదండ్రులు సైతం హ్యాపీగా ఫీలయ్యారట. తాము చేయలేని పనిని స్కూల్ యాజమాన్యం చేసినందుకు వారిని అభినందించారట. ఇక.. ఫోన్లు పగలకొట్టే సమయంలో పిల్లల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందట. సొంత మనుషుల్ని కోల్పోయినట్లుగా విలవిలలాడిపోయారట. విద్యార్థులకు తామిచ్చిన పనిష్మెంట్ ను వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయటంతో.. ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు చెప్పండి.. మీరూ ఇలాంటి పనిష్మెంట్‌ను ఎంజాయ్ చేయరు?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/