విజయనగరం జిల్లా అంతా చిన్న శీనుదేనా?

Update: 2020-07-15 02:30 GMT
విజయనగరం జిల్లాను మొత్తం మంత్రి బొత్స సత్యనారాయణ ప్యాక్ చేశారా? అంతా తన బంధుగణాన్ని నింపేశారా? ఇప్పుడు ఆ జిల్లాలో మంత్రి బొత్స ఏం చెబితే అంతేనా? అంటే ఔననే అంటున్నారు ఆ జిల్లా అసంతృప్త నేతలు.. బొత్స గత ఎన్నికల్లోనూ అందరూ తనవాళ్లనే పోటీచేయించి వైసీపీ గాలిలో గెలిపించేశాడు. సో ఆయనకు ఎదురు చెప్పే నాయకుడే ఇప్పుడా జిల్లాలో లేకుండా పోయారని కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ వాపోతున్నారు.

ఇక జిల్లా రాజకీయాలను బొత్స సత్యనారాయణతోపాటు ఆయన సమీప బంధువు మజ్జి శీను (చిన్న శీను) శాసిస్తున్నారని.. ఈ శీను కనుసన్నల్లోనే జిల్లాలో రాజకీయం చాలా వరకు నడుస్తోందని కొందరు అసంతృప్తులు కక్కేస్తున్నారు. దీంతో బొత్సకు ఎదురునిలిచే వారే ఆ జిల్లాలో లేకుండా పోయారట..

ప్రస్తుతం విజయనగరం సిటీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాత్రమే బొత్స వర్గానికి చెందకుండా ధైర్యంగా ఉంటున్నారని.. ఇక మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఆయన బంధువులు, సన్నిహితులని అంటున్నారు. అందుకే ఇప్పుడు జిల్లాలో మిగిలిన వారికి ప్రాధాన్యం లేకపోవడం.. పార్టీలో, నామినేటెడ్ పదవుల్లో పార్టీ సీనియర్లకు కాకుండా బొత్స అనుచరగణానికే అన్నీ దక్కుతున్నాయని ఆ నేతలు వాపోతున్నారు. ప్రస్తుతం పార్టీలోని సీనియర్లు బొత్సపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారట..

జిల్లాలో ఏ పదవులు, పోస్టుల్లో అంతా బొత్స వర్గమే కొలువుదీరడంతో మిగతా వారు దీనిపై రగిలిపోతున్నారట.. బొత్స రాష్ట్ర మంత్రి కావడంతో అంతా ఆయన అనుంగ అనుచరుడు చిన్న శీను నడిపిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
Tags:    

Similar News