టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ముసునూరు తహసీల్దార్ వనజాక్షి విషయంలో చింతమనేని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డారని వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టారని చింతమనేనితోపాటు ఆయన అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతమనేనికి కష్టాలు బాగా పెరిగాయి. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లొచ్చారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు.
కాగా తాజాగా హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం చినకంజర్లకు సమీపంలో చింతమనేని ప్రభాకర్ కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా పలువురు పట్టబడ్డ విషయం తెలిసిందే. అయితే అక్కడ నుంచి చింతమనేని తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వీడియోలో ఆయన కూడా ఉన్నారని పేర్కొంటున్నారు.
మరోవైపు కోడిపందేల్లో తాను లేనని బుకాయించిన చింతమనేని ఎట్టకేలకు తన తప్పు ఒప్పుకున్నారు. కోడి పందేలు తాను నిర్వహించలేదని.. అయితే కోడి పందేలు జరుగుతున్నాయని తెలిసి అక్కడకు వెళ్లానని చెబుతున్నారు.
అయితే, పటాన్‌చెరు నుంచి అదృశ్యమైన చింతమనేని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రైతుల సమస్యలపై ఏలూరు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు చింతమనేని వచ్చారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో జరిగిన కోడి పందేల్లో పాల్గొన్న మాట వాస్తవమేనని తెలిపారు. అక్కడి నుంచి వస్తుంటే పటాన్‌చెరులో భోజనం కోసం తెలిసినవారు తనను పిలిచారని చింతమనేని చెప్పారు. భోజనం చేసిన తర్వాత కోడి పందేలు నిర్వహిస్తున్నారని తెలిస్తే అక్కడికి వెళ్లానని చెప్పారు.
తాను కోడిపందేలు నిర్వహించానని వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. కోడిపందేలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి కొంత మంది పోలీసులు వస్తున్నారని ముందుగానే సమాచారం రావడంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పారు. తెలంగాణ పోలీసుల నుంచి తనకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.