తన తమ్ముడు నిజాయతీ నిబద్ధత కలిగిన నాయుడు కల్మషం లేని వాడు. అలాంటి వారు ఏపీకి కావాలి. ప్రజలు అతనికి ఏ విధంగా స్థానం ఇస్తారో అంటూ మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్స్ చేశారు. పవన్ని ఉన్నత స్థానంలో చూడాలని ఉందని రాష్ట్రాన్ని ఏలే చాన్స్ రావాలని అన్నగా చిరంజీవి బలంగా కోరుకుంటున్నారు.
ఒక విధంగా జనసేనకు మెగా గిఫ్ట్ ని దసరాకు ముందే చిరంజీవి ఇచ్చేసినట్లే అనుకోవాలి. తన మద్దతు ఎపుడూ తన తమ్ముడికి ఉంటుంది అంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. ఇక మద్దతు విషయంలో కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా తమ్ముడికే అంటూ ఇంత క్లారిటీగా చిరంజీవి ఎపుడూ చెప్పలేదు.
అయితే గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కి ముందు మీడియా ఆయన్ని అడిగిన దానికి బదులిస్తూ రాజకీయాల మీద కామెంట్స్ చేశారు. జనసేన అధికారంలోకి రావాలని మనస్పూర్తిగా చిరంజీవి కోరుకున్న తీరు చూస్తూంటే ఏపీలో కొత్త సమీకరణలకు తెర తీయడం జరుగుతుందా అన్నదే చర్చగా ఉందిపుడు.
ఇక తాను రాజకీయాల్లో లేను, సైలెంట్ గా ఉన్నాను అని చిరంజీవి చెబుతూనే పవన్ గురించి రాజకీయ కామెంట్స్ చేశారు. పైగా తానొక వైపు తమ్ముడు ఒక వైపు ఉండడం వల్ల అతనికి నష్టం వస్తుందని, అందుకే తాను సైలెంట్ గా ఉంటున్నాను అని చిరంజీవి చెప్పడం కూడా గమనార్హం. అంటే ఎన్ని పార్టీలు చిరంజీవిని తమ వైపునకు రమ్మని పిలిచినా ఆయన ఆ వైపునకు చూడకుండా ఉండడం వెనక తమ్ముడికి మద్దతు ఇచ్చే ఆలోచన ఉండబట్టే అని ఇపుడు విశ్లేషిస్తున్నారు.
ఇక దీనికి ముందు కొన్నాళ్ల క్రితం జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఒక మాట అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఎపుడూ జనసేనకే అని. అదే ఇపుడు నిజం కాబఒతోంది అని కూడా అంటున్నారు. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. దాంతో మెగాస్టార్ కామెంట్స్ కూడా వేడిని మరింతగా పెంచుతున్నారు.
ఎన్నికల వేల చిరంజీవి కనుక ప్రచారంలోకి దిగితే జనసేనకు ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని భావించాలి. అంటే 2024 ఎన్నికలలో చిరంజీవి జనసేనను గెలిపించండి అంటూ జనంలోకి రాబోతున్నారు అన్న మాట. సో తమ్ముడు కళ్ళలో ఆనందం చూడడమే అన్నగా చిరంజీవికి కావాల్సింది అని అర్ధమైపోతోంది కదా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.