కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష మరిన్ని మలుపులు తిరుగుతోంది. ముద్రగడ పద్మనాభం దీక్ష - ఏపీలో పరిస్థితుల నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేతలు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ సమావేశమయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు - వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ - అంబటి రాంబాబు తదితరులు పాల్గొనగ ఈ అత్యవసర సమావేశానికి కాంగ్రెస్ నాయకుడు - ఎంపీ చిరంజీవి హాజరయ్యారు. సుదీర్ఘ సమావేశం అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దాసరి నారాయణరావు సైతం ప్రభుత్వం తీరును తప్పుపట్టారు.
ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం హేయమని వారు విమర్శించారు. ఆయన శాంతియుతంగా దీక్ష ప్రారంభించిన రెండు గంటల్లోపే ప్రభుత్వం తరఫున పోలీసులు తలుపులు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని చిరు మండిపడ్డారు. ముద్రగడ కోడలు - భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారని, ఈ తీరును తామంతా ఖండిస్తున్నట్లు తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన తామందరికీ ఉందని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని చిరంజీవి హెచ్చరించారు. ముద్రగడ కొత్తగా ఏ డిమాండ్లూ చేయలేదనీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమనే కోరుతున్నారని పేర్కొన్నారు.పాత హామీల అమలు కోసం రెండ్రోజుల గడువును రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నామని అప్పటికీ పరిష్కారం చూపకపోతే మరోమారు సమావేశమై తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తుని ఘటనను ఎవరూ హర్షించరని చిరంజీవి స్పష్టం చేశారు. అయితే ఆ సాకుతో కాపు యువకులపై అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు.