భుజానికి అయిన గాయానికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఈ శస్త్రచికిత్సను రోజు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు.. చిరు సతీమణి సురేఖ ఉన్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స పూర్తి అయ్యాక దాదాపు రెండు నెలల పాటు చిరు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
చిరు ఆపరేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తన 150వ చిత్ర షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకునేందుకు వీలుగా సినిమా ప్రారంభానికి ముందే చిరు శస్త్రచికిత్స చేయించుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఆపరేషన్ అనంతరం బాగా కోలుకున్నాకే చిరు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో చెప్పినట్లుగా ఈ నెలలో చిరు హైదరాబాద్ వచ్చే అవకాశం లేదని.. మార్చి మొదటి వారానికి ఆయన హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా చిరుకు జరుగుతున్న ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయి.. ఆయన చక్కగా కోలుకొని చలాకీగా హైదరాబాద్ కు రావాలని కోరుకుందాం.