కాంగ్రెస్ మాజీ ఎంపీ - సీనియర్ పొలిటిషియన్ సి.రామచంద్రయ్య... వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన రామచంద్రయ్య వైసీపీలో చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కారణం కాపు సామాజిక వర్గానికి చెందిన రామచంద్రయ్య జనసేనలో చేరతారని ప్రచారం జరగడం. పైగా అతను మాజీ ప్రజారాజ్యం ముఖ్యుడు. చిరు నమ్మినబంటు. ఒకవైపు చిరంజీవి తమ్ముడికి మద్దతుగానే కాంగ్రెస్ లో చప్పుడు చేయకుండా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో గతంలో ఆయన మనిషి అయిన రామచంద్రయ్య కూడా జనసేనకు జై కొడతారని భావించారు. కానీ, అనూహ్యంగా రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.
ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే... రామచంద్రయ్య పూర్తిగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లోకి చిరుతో పాటే చేరారు. మరి పార్టీని వదిలేసినపుడు చిరంజీవితో చర్చించలేదా? చిరంజీవితో చర్చిస్తే... వైసీపీలోకి ఎందుకు తమ్ముడి పార్టీ ఉండగా అని చిరంజీవి అనలేదా? ఒకవేళ అనకపోతే... చిరంజీవికే జనసేన మీద నమ్మకం లేదా వంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదయినా జరిగి ఉండాలి. లేదంటే... చిరుకు అతనికి సంబంధాలు పూర్తిగా తెగిపోయి ఉండాలి. ఒకవేళ రెండోది జరిగితే.... రామచంద్రయ్య కు చిరుకు మధ్య ఇంత దూరం ఎపుడు పెరిగిందన్నది ఆసక్తికరమైన విషయమే.
ఇదిలా ఉంటే... నాదెండ్ల మనోహర్ తప్ప...జనసేనలో పెద్ద తలకాయలు లేవు. మొన్నామధ్య పవన్ మాట్లాడుతూ మాకు ఉడుకు రక్తమూ కావాలి, మార్గదర్శకత్వం చేసే అనుభవమూ కావాలి అన్నాడు. మరి అలాంటి కోటాలో రామచంద్రయ్యకు పిలుపు వచ్చే ఉంటుందని భావిస్తున్నారు. కాకపోతే సీనియర్ రాజకీయ నాయకుడు అయిన రామచంద్రయ్యకు జనసేన భవిష్యత్తుపై నమ్మకం లేదేమోనన్న అనుమానాలున్నాయి. ఆల్రెడీ అన్న అనుభవాలను గమనించిన రామచంద్రయ్య నెమ్మదస్తుడయిన చిరంజీవే నిలువలేనపుడు నిలకడ లేని పవన్ - ఆవేశపూరిత వ్యక్తిత్వం కలిగిన పవన్ రాజకీయాలకు పనికి రాడని ఆయన ఫిక్సయ్యారేమో.
పైగా చిరంజీవి - పవన్ ల నుంచి ఆహ్వానం అందకపోవడం కూడా కారణం కావొచ్చంటున్నారు. అలాంటపుడు తానే ఎందుకు కెలుక్కోవడం - వైసీపీకి వస్తోన్న జనాదరణ...జగన్ కు వస్తోన్న ప్రజాదరణ చూసి ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోయినా పర్లేదు అధికార పార్టీలో ఉంటే చాలనుకుని వైసీపీలో చేరారేమో అనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా....రామచంద్రయ్య వైసీపీలో చేరబోవడంపై జనసేన కార్యకర్తలు - మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.