ప్రజారాజ్యం పార్టీ దాన్ని గంగానదీ అంత వయసున్న కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు మెగాస్టార్ చిరంజీవి. దానికి ప్రతిగా కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. ఆరేళ్లు ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ మెగాస్టార్ ఎక్కడా కన్పించలేదు. అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్తున్న రఘువీరారెడ్డి.. ప్రచారానికి మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నారని ప్రకటించారు. ఒకవేళ నిజంగా మెగాస్టార్ ప్రచారానికి వస్తే.. దాని ప్రభావం అందరికంటే ఎక్కువుగా జనసేన పైనే ఉంటుంది. జనసేనకు పడే ఓట్లన్నీ మెగా ఎఫెక్ట్ తో చీలిపోతాయి. రఘువీరారెడ్డి అయితే ప్రకటించారు కానీ ఇప్పటివరకు మెగాస్టార్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఎంపీగా పదవి ముగిసిన తర్వాత మెగాస్టార్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తే.. కాంగ్రెస్ పార్టీ తాలూకు ఏ కార్యక్రమానికి చిరంజీవి వెళ్లలేదు. కాంగ్రెస్ అని కాదు అసలు ఏ రాజకీయ కార్యక్రమానికి పోలేదు. రాజకీయాల్ని పక్కనపెడితే.. సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. అన్నింటికి మించి… టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు నాగబాబు. మరోవైపు.. పవన్ పిలవాలే కానీ మా కుటుంబం మొత్తం జనసేనకు ప్రచారం చేస్తుందని ఇప్పటికే రామ్ చరణ్ ప్రకటించాడు. మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయిన చిరంజీవి అనుమతి లేకుండానే నాగబాబు - చరణ్ ఈ స్టేట్ మెంట్స్ ఇచ్చి ఉంటారా. ఛాన్సే లేదు. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు.. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి వచ్చి ప్రచారం చేసే అవకాశమే లేదని.