బీజేపీ నుంచి చిరుకు పిలుపు వ‌చ్చింది అందుకేనా?

Update: 2021-07-02 08:44 GMT
కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వ‌చ్చిందా?  కీల‌క రాజ‌కీయ అంశంపై ఆయ‌న‌తో చ‌ర్చించేందుకు బీజేపీ నేత‌లు మొగ్గు చూపుతున్నారా? అంటే.. పొలిటిక‌ల్ స‌ర్కిళ్లు స‌హా.. టాలీవుడ్‌లోనూ ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌స్తుతం ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలో జ‌న‌సేన‌తో బీజేపీ చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. ఈ రెండు పార్టీలూ క‌లిసే ఉన్నాయి. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీ వ్యూహం మ‌రోలా ఉంది.

త‌మతో చేతులు క‌ల‌పడం కాదు.. ఏకంగా త‌మ పార్టీలో జ‌న‌సేన‌ను విలీనం చేయాల‌ని బీజేపీ నేత‌లు ప్ర‌పోజ్ చేస్తున్నారు. దీనిపై కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఈ విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదని కూడా స‌మాచారం. ఈ క్ర‌మంలో బీజేపీ అధిష్టానం అనూహ్యంగా అడుగులు వేస్తోంది. జ‌న‌సేన‌ను త‌మ పార్టీలో విలీనం చేసే బాధ్య‌త‌ను ఏకంగా ప‌వ‌న్ సోద‌రుడు.. చిరంజీవిపై పెట్టాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

``మా ఏపీ పార్టీని ప‌వ‌న్‌చేతుల్లో పెడ‌తాం. పార్టీని డెవ‌ల‌ప్ చేసే బాధ్య‌త‌ను కూడా అప్ప‌గిస్తాం. సో.. జ‌న‌సేన‌ను విలీనం చేసేలా మీరు ఒప్పంచండి`` అని చిరును కోరేలా .. బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ప‌వ‌న్‌కు మంచి లైఫ్ ఇస్తామ‌ని కూడా బీజేపీ పెద్ద‌లు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియ‌క చిరు.. కొంత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై చిరు త‌న కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించాకే బీజేపీ పెద్ద‌ల ఆహ్వానం మేరకు వారిని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ సాగుతోంది.

అయితే.. ఈ విష‌యంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చిరు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈ పార్టీకి బ‌ద్ధ శ‌త్రువైన బీజేపీ నేత‌లు త‌న‌ను ఆహ్వానిస్తే.. వెళ్ల‌డం స‌బ‌బేనా.. అనే విష‌యంలోనూ చిరు ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చిరు ప్ర‌జారాజ్యం పార్టీని విలీనం చేసిన నేప‌థ్యంలో త‌ద‌నంత‌రం త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌పైనా చిరు ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి.. బీజేపీ పెద్ద‌ల నుంచి పిలుపు వ‌చ్చినా.. చిరు కొంత సంయ‌మ‌నం పాటిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News