ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు మందు లేదు. ఈ నేపథ్యంలో దాని నివారణకు కృషి చేస్తున్నారు. కరోనాను తగ్గించేందుకు మందు కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కరోనా సోకిన వారికి వైద్యం అందిస్తున్న సమయంలో వారికి మలేరియా రోగులకు ఇచ్చే మందు ఇప్పుడు వాడుతున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు కరోనా వైరస్ బాధితులకు తక్షణ చికిత్సకు అందిస్తున్నారు. అందుకే ఇటీవల అమెరికాతో పాటు పలు దేశాలు భారతదేశ సహాయం కోరాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు భారతదేశం లో అధికంగా ఉండడంతో ఆ దేశాలు భారత్‌కు విజ్ఞప్తులు చేస్తున్నాయి.
అయితే హైడ్రాక్సి క్లోరొక్విన్ మందు కరోనా వైరస్‌కు మందు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ ఔషధాన్నే వినియోగిస్తున్నారు. కరోనా నివారణకు హైడ్రాక్సి క్లోరోక్విన్ మందును వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఈ మందుపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో కూడా మద్దతు పలికారు. మలేరియా చికిత్సలో భాగంగా జ్వరాన్ని, నొప్పిని తగ్గించేందుకు క్లోరోక్విన్ ఆధారిత మాత్రలను సాధారణంగా వాడుతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తే కూడా జ్వరం, ఇతర నొప్పులు ఉండడంతో కరోనా నివారణకు కూడా ఆ మందు వాడాలని ఆయా దేశాల అధినేతలు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ను క్లోరోక్విన్ కట్టడి చేయడానికి కొంత దోహదం చేస్తోందని, చికిత్స కోసం కొంతమేర సాయపడుతున్నట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది.
అయితే ఆ క్లోరోక్విన్ ఆధారిత ఔషధాలను కరోనా రోగులకు పూర్తిస్థాయిలో వాడొచ్చని ఎవరూ పక్కాగా చెప్పడం లేదు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లేకపోవడంతో ఆ మందు వినియోగించడంలో ఆటంకం ఏర్పడుతోంది. అయితే ఆ మందు వాడడంతో మూత్రపిండం, కాలేయం దెబ్బతినడంతో పాటు మరికొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా తలెత్తే ప్రమాదాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. దీంతో ఆ మందు వినియోగంపై ఆందోళనలు రేగుతున్నాయి. ఔషధాల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు ఇంకా విస్తృతంగా ర్యాండమ్ క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు, వివిధ విశ్వవిద్యాలయ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ మందుపై ఇప్పటికే అమెరికా, బ్రిటన్, స్పెయిన్, చైనాతో పాటు భారతదేశంలో 20కి పైగా దేశాల్లో ప్రస్తుతం ఈ ఔషధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. మలేరియా నిరోధక ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం పరిశోధకులు, శాస్త్రవేత్తలు చేస్తున్నారు.C