అమ్మడి కోసమే అన్ని షాట్లు కొట్టాడంట

Update: 2016-01-05 04:45 GMT
‘‘నువ్వు చేసే ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశా. నీ కళ్లు అందంగా ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత మనం కలిసి డ్రింక్స్ కి వెళతామని అనుకుంటున్నా బేబీ. మరీ.. సిగ్గు పడిపోకు’’ ఇలాంటి మాటలు స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ లాంటోడు ఏ అమ్మాయికైనా చెబితే పడిపోకుండా ఉంటుందా? కానీ.. పర్సనల్ గా చెప్పాల్సిన ఫీలింగ్స్ ను పబ్లిక్ గా చెప్పేసి తన మాటలతో కలకలం రేపాడు.

తాజాగా జరిగిన ఒక మ్యాచ్ లో 15 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా తనను ఇంటర్వ్యూ చేస్తున్న మహిళా ప్రజంటర్ తో చేసిన వ్యాఖ్యలు సదరు ప్రజంటర్ తో పాటు.. ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్న పలువురు షాక్ తిన్న పరిస్థితి. ఆటలో ఎంత దూకుడుగా ఉంటాడో... అమ్మాయిల విషయంలోనూ ఈ వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ దూకుడెక్కువే. ప్లేబాయ్ ఇమేజ్ ఉన్న గేల్ అమ్మాయిలతో పార్టీలు.. పబ్ ల చుట్టూ తిరుగుతూ తరచూ వార్తల్లోకి వస్తుంటాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ వివాదంలోకి వెళితే..

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో హోబార్డ్ – మెల్ బోర్న్ రెనగేడ్స్ మధ్య జరుగుతోంది. ఇందులో క్రిస్ గేల్ మెల్ బోర్న్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  ఈ మ్యాచ్ లో గేల్ కేవలం 15 బంతుల్లో 41 పరుగులు చేశాడు. మ్యాచ్ గెలుపులో గేల్ బ్యాటింగ్ మెరుపులు సాయం చేశాయి. ఈ నేపథ్యంలో గేల్ ను టెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ మెలానీ మెక్ లాఫిలిన్ ఇంటర్య్వూ చేసింది.

ఈ సందర్భంగా ఆమె అందాన్ని లైవ్ లో పొగిడేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఊహించని పరిణామంతో సదరు ప్రజెంటర్ షాక్ తిన్న పరిస్థితి. అయితే.. అప్పటికి తనకు తాను సర్దుకొని.. గేల్ వ్యాఖ్యల్ని లైట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక.. గేల్ వ్యాఖ్యలు దుమారాన్నే రేపుతున్నాయి. చేతులారా వివాదాల్ని కొని తెచ్చుకోవటం అంటే ఇదేనేమో.
Tags:    

Similar News