ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల పంట పండిందని ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల్లో 10 లక్షల 54వేల 590 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, వివిధ రంగాల్లోని 665 ఒప్పందాలతో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సదస్సులో ఏడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి రోజు సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, రెండో రోజు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల్లో మెజార్టీ వర్గాలకు ఉద్యోగం దొరుకుతుంది. అదే సమయంలో పరోక్ష ఉపాధి దక్కుతుంది. గత ఏడాది కూడా జరిగిన సమ్మిట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. అయితే అవి కొంతమేరకే కార్యారూపం దాల్చాయి. ప్రస్తుతం ఎంఓయూ మార్చుకున్న కంపెనీలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే కనుక నిరుద్యోగ సమస్య ఉండదని అంటున్నారు.
తాజా సీఐఐ సమ్మిట్ లో రంగాలవారీగా పెట్టుబడుల వివరాలు:
-పరిశ్రమల రంగంలో 91 ఒప్పందాలు కుదిరాయి. రెండు లక్షల వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. పది లక్షలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
- ఇంధన రంగంలో రెండు లక్షల రెండువేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికి సంబంధించి 47 ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో 86 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
-ఏపీసీఆర్డీఏతో 62 ఒప్పందాలు కుదిరాయి. దీనికి సంబంధించి లక్షా 24వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
-మైనింగ్ రంగంలో 11.113 కోట్ల పెట్టుడులు వచ్చాయి. వీటికి సంబంధించి 50 ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో 17 వేల మందికి ఉపాధి లభించనుంది.
-ఆహారశుద్ధి రంగంలో 177 ఒప్పందాలు కుదిరాయి. 6,055 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 60 వేల మందికి ఉపాధి లభించనుంది.
-పర్యాటక రంగంలో 69 ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో 7,237 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 50 వేల మందికి ఉపాధి లభించనుంది.
-ఐటి రంగంలో 67 ఒప్పందాలు కుదిరాయి. 4,813 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. 47 వేల మందికి ఉపాధి లభించనుంది.
- రోడ్లు భవనాల శాఖలో 74 వేల కోట్ల పెట్టుబడితో ఒక ఒప్పందం కుదిరింది.
-ఏపి టౌన్‌షిప్ వసతుల కల్పనలో 14 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, రెండు లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
-నైపుణ్యాభివృద్ధి రంగంలో మూడు వేల కోట్లతో మూడు ఒప్పందాలు కుదిరాయి.
జౌళి రంగంలో ఎనిమిది ఒప్పందాలు 521 కోట్ల రూపాయల పెట్టుబడులు, 18,550 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ఉన్నత విద్యారంగంలో తొమ్మిది ఒప్పందాలు, 16,706 కోట్ల పెట్టుబడులు, లక్షా 52 వేల ఉద్యోగాలు రానున్నాయి.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ద్వారా కూడా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. ఏపిఈడిబి ద్వారా 3,66,662 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. విశాఖలో ఐటి పార్క్ నిర్మాణానికి చైనాకు చెందిన చెంగ్డూ జింగ్రాంగ్ గ్రూప్ 94 వేల 26 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. ఈ పార్క్‌లో 400 ఐటి కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి బిఆర్ షెట్టి గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే సంస్థ అమరావతి, కర్నూలులో 12 వేల కోట్లతో మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు 68 వేల కోట్లతో నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్ ఫండ్‌తో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా లక్షా 10 వేల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్ , విండ్ పవర్ ప్లాంట్ల నిర్మించడం కొసం 43 వేల కోట్లతో గ్యోడియన్ టెక్నాలజీతో ఒప్పందం కుదిరింది. విశాఖ జిల్లా నక్కపల్లిలో 40,800 కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు జర్మనీకి చెందిన క్రియాన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో సైన్స్ సిటీ నిర్మాణానికి ఎంటిఐపి ఇన్నోవేషన్ సంస్థ 21,800 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. సిలికా సోలార్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 23,285 కోట్లతో నెడ్ క్యాప్ - సోలర్జీస్ ఇండి ఒప్పందం కుదుర్చుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/