‘‘కష్టపడి పైకొచ్చినోళ్లుంటారు.. సులువుగా పైకొచ్చినోళ్లుంటారు. నేను రెండో రకం అనుకుంటున్నావేమో.. మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చాను. నాకు భయపెట్టడం ఇష్టం... బ్రతకడం ఇష్టం- ఎలాగైనా... దాచుకోవడం ఇష్టం.. లాక్కోవడం ఇష్టం.. ఆక్రమించుకోవడం ఇష్టం.. భూములైనా - ఆడవాళ్లైనా...’’
ఇది ఒక సినిమాలోని డైలాగు!
ఈ డైలాగును కాస్త మార్చి చదువుకుంటూ. ‘‘నాకు భయపెట్టడం ఇష్టం.. నా వేదికల మీద ఎవరైనా ఇష్టంలేని విషయం మాట్లాడితే.. నాకు లాక్కోవడం ఇష్టం.. ప్రతిపక్షం ఎమ్మెల్యేలని - వారి టిక్కెట్ పై గెలిచిన వారిని..’’ అని రాసుకుంటూ పోయాం అనుకోండి.. ఆ డైలాగులు అచ్చంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అతికినట్లుగా సరిపోతాయి అని జనం అనుకుంటున్నారు. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ.. రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలు వదిలేసి.. విపక్షం వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకున్న చంద్రబాబుకు ఇంకా ఆ ఫిరాయింపుల దాహం తీరినట్లుగా లేదు. ఇంకా ఇంకా.. ఆ పార్టీ నాయకుల్ని తమలో కలిపేసుకోవడానికి ఆయన ఎగబడుతున్నట్లుగా ఉంది. ఎమ్మెల్యేల వంతు అయిపోయిందేమో.. వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుల్ని కూడా ఎరవేసి తమ పార్టీలోకి లాక్కోవడానికి మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత కాంగ్రెస్ జమానాలో మంత్రిగా కూడా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు స్వయంగా.. తను తెలుగుదేశం లో చేరాల్సిందిగా ఆ పార్టీనుంచి ఒత్తిడి చేస్తున్నారంటూ వెల్లడించడం ఇప్పుడు సంచలనాంశంగా మారుతోంది.
సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కక్కుర్తి పడి విపక్షాల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించినా సరే.. ఏదో తమ ప్రభుత్వానికి గండం ఉన్న సందర్భాల్లో అలాంటి నీచాలకు పాల్పడుతుంటారు. గట్టెక్కడానికి ఆ తప్పుడు మార్గాన్ని వాడుకుంటారు. కానీ.. తమ పార్టీ నిండు బలంతో ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రత్యర్థి పార్టీని సమూలంగా నాశనం చేయాలనే దుర్బుద్ధితో.. అందులోని నాయకులకు తాయిలాలు చూపించి - ఎరవేసి - బెదిరించి - కేసుల భయం పెట్టి.. ఏదో ఒక రకంగా అధికార పార్టీలోకి చేర్చుకోవాలనే వైఖరి చంద్రబాబులోనే కనిపిస్తున్నదని ధర్మాన మాటలు విన్న పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకూ తొలుత చెప్పుకున్న ప్రకాష్ డైలాగులు ఏ సినిమాలోనివో తెలుసా.. చాలా మంది సినీ ప్రియులకు గుర్తుండే ఉండవచ్చు. పోకిరి చిత్రంలో.. మహేష్ బాబుతో తొలిసారి కలిసినప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు అవి. అలాంటి డైలాగులు రాసినందుకు పూరీ జగన్నాధ్ ఆ ఏడాదిలో నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ డైలాగు అచ్చంగా చంద్రబాబుకు సరిపోయేలాగానే ఉందని జనం భావిస్తున్నారు.