వాహనదారులకు అలర్ట్..రోడ్డెక్కితే అంతే సంగతులు !

Update: 2020-04-11 08:13 GMT
కరోనా వైరస్‌ నివారించేందుకు ప్రభుత్వం లాక్‌ డౌన్‌  ను పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. దీనితో తెలంగాణలో పోలీసులు అలాంటివారికోసం ఏకంగా ఓ యాప్‌ ను సిద్ధం చేసారు. దే సిటిజన్ ట్రాకింగ్ కొవిడ్-19 యాప్. ఇకపై రూల్స్‌ కి వ్యతిరేకంగా ఎవరైనా బైకులు - కార్లపై 3 కిలోమీటర్లకు మించి తిరిగితే... వెంటనే సిటిజన్ ట్రాకింగ్ కరోనా యాప్‌ లో కేసు నమోదు చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈ యాప్ అమల్లోకి వస్తోంది.

ఇక పై ఎవరైనా రోడ్లపైకి  వాహనాలతో వస్తే ...  సిటిజన్ ట్రాకింగ్ యాప్‌ లో ఆ వాహనం నంబర్ ఎంటర్ చేస్తారు. అది మొత్తం వివరాలు బయటపెడుతుంది. ఈ విషయం తెలియని బండి వ్యక్తి... అలా జాయ్‌ గా బండి నడుపుకుంటూ... ముందుకు వెళ్తారు. అలా ఆ బండి వెళ్తున్న చోట్ల... వేర్వేరు ప్రాంతాల్లో దాని నంబర్‌ ఎంటరవుతూ ఉంటుంది. తద్వారా ఆ బండి ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్లిందే లెక్క తేల్చేస్తుంది. అది 3 కిలోమీటర్లు దాటిందంటే చాలు... కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత వాహనాన్ని సీజ్ చేస్తారు.

దీనితో, ప్రతి ఒక్క వాహనదారుడు ఈ విషయాన్నీ గమనించాలి.  మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా  3 కిలోమీటర్ల లోపు ఉన్న షాపుల్లోనే కొనుక్కుంటే  మీకే మంచిది. అయితే, మందుల విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ మందు 3 కిలోమీటర్ల పరిధిలో దొరకకపోతే - అప్పుడు పోలీసులకు విషయం చెప్పి - వారి అనుమతి తో చుట్టు పక్కల వేరే మెడికల్ షాపులకు వెళ్లి రావచ్చు. అయితే , ఏది చేసినా కూడా ప్రజల మంచి కోసమే కాబట్టి .. పోలీసులు చెప్పినట్టు వినండి. 
Tags:    

Similar News