శతాబ్దంన్నరకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అది ఓ సముద్రం లాంటిది. అలాంటి పార్టీ.. ఒకవైపు నష్టం జరుగుతుందని తెలిసీ కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావించగా చుక్కెదురైంది. అధికారం దక్కకపోగా ఆశించిన ఫలితం రాలేదు. అయితే అనంతరం జరిగిన పరిణామాలు పార్టీని తీవ్రంగా దెబ్బతీయగా.. దాంతో పాటు పార్టీలో విబేధాలు తార స్థాయికి చేరాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాక ఆ పార్టీలో విబేధాలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసరికి ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గ పోరు ఉంది. దీంతో పార్టీలో విబేధాలు పెరిగి చివరకు ఎన్నికల్లో పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ఉన్న విబేధాలు మచ్చుకు కొన్ని..
- పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్‌రెడ్డి దూకుడుగా.. సొంత అజెండాతో దూసుకెళ్తూ అధికార పార్టీపై పోరు చేస్తున్నాడు. అయితే ఈయన రాకను మొదటి నుంచి పార్టీలోని ఒక వర్గం ఇష్టపడడం లేదు. అతడి రాకను వ్యతిరేకించారు. అయినా అధిష్టానం అవేమీ పట్టించుకోకుండా అతడిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో పార్టీలో అతడి పట్ల అందరిలో వ్యతిరేకత ఏర్పడింది. ఇటీవల తన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పట్నం గోస అంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఇదే లోక్ సభ నియోజకవర్గంలోనే ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కార్యక్రమం లో పాల్గొనలేదు. దీంతో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇక చాలామంది నాయకులు ఉన్నా రేవంత్ రెడ్డి అంటే ఇష్టపడక పోవడంతో పట్నంగోస కార్యక్రమానికి హాజరు కాలేదు.
- ఇక భువనగిరి లోక్ సభ పరిధిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పీపీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సఖ్యత లేదు. పార్టీ కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసి పాల్గొనడం లేదు. అసలు రాజకీయాలకు దూరంగా పొన్నాల ఉన్నారు. గతంలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం దీక్ష చేస్తే ఇదే ప్రాంతంలో ఉన్న పొన్నాల స్పందించలేదు.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విబేధాలు ఉన్నాయి. అటవీ ప్రాంతం ఎప్పటికీ కాంగ్రెస్ కు కంచుకోట. అలాంటి కోటలో కూడా విబేధాలతో బీటలు బారుతోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరూ ఉప్పునిప్పులాగ ఉన్నారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలిగా ప్రేమ్ సాగర్ సతీమణికి కేటాయించినప్పటి నుంచి వీరి మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం కీలకంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. జిల్లా నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆయనకు అధిష్టానం అండదండలు ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ ఇది తట్టుకోలేకపోతున్నాడు. దీంతో శ్రీధర్ బాబు తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతడి ఓటమికి తీవ్రంగా పని చేసి విజయవంతం చేసింది. అయితే ఆ తర్వాత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ప్రస్తుతం రాజకీయంగా అంతగా ప్రాధాన్యం చూపడం లేదు.
- నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఇదే పరిస్థితి కనపడుతోంది. మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌కి, కాంగ్రెస్ నేత కొమిరెడ్డి రాములుకు అసలు పొసగడం లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు కొమిరెడ్డి రాములు అనుచరులు మధుయాష్కి గౌడ్ వాహనంపై దాడి చేశారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వీరి మధ్య సమన్వయం కుదరడం లేదు. తనకు తెలియకుండానే ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క తన అనుచరులకు పదవులు ఇస్తున్నారని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది.
- కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకున్న నల్లగొండ జిల్లాలో అగ్ర నాయకులు చాలా మందే ఉన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా. కొమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి ఉన్నారు. ఈ జిల్లాలో ఏ ఇద్దరి నేతల మధ్య సమన్వయం లేదు. సీనియర్లంతా తమ ప్రతాపం చూపించుకుంటున్నారు. పార్టీలో తామే కింగ్ లమని చెప్పుకుంటూ కొన్ని నియోజకవర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి కొమటిరెడ్డి బ్రదర్స్ కు అస్సలు పడదు. జానారెడ్డి సైలెంటయ్యారు. రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి రాజకీయంగా దూరమయ్యారు. ఇంత మంది ఉన్నప్పటికీ ఏ ఒక్కరి మధ్య సమన్వయం లేదు.
- మెదక్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి ఈ జిల్లా నుంచే ఉన్నారు. అయితే వీరందరూ ఏకతాటిపై లేరు. ఎవరూ కలసి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు.
జగ్గారెడ్డి కొంచెం యాక్టివ్ గా ఉండగా రాజనర్సింహ, గీతారెడ్డి రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. విజయశాంతి మాత్రం ఎన్నికల సమయంలో మెరుస్తున్నారు.
- వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే నాయకుడే కరువయ్యారు. మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య తన సొంత నియోజకవర్గమైన జనగామ నుంచి వెళ్లిపోయారు. పార్టీలో ఉన్న నాయకులంతా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఈ పార్టీకి పెద్ద దిక్కు లేరు.
- పాలమూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ ఖిల్లా. ఈ జిల్లాలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉండేవారు. అయితే పరిణామాలు మారి పోవడంతో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో చేరారు. ఇప్పుడు ఈ జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్ రెడ్డి, సంపత్ కీలకంగా ఉన్నారు. అయితే వీరి మధ్య సంబంధాలు సక్రమంగా లేవు. ఎవరి దారి వారిదే. అటు మక్తల్, నారాయణపేట లో ఒకప్పుడు పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు అక్కడ నాయకులే కరువయ్యారు.
ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వర్గ విబేధాలతో సతమతమవుతోంది. నాయకుల మధ్య సఖ్యత.. ఐక్యత లేక పార్టీ దెబ్బతింటోంది. ఈ నాయకుల వైఖరితో బలంగా ఉన్న కేడర్ నీరసపడుతున్నారు. తమ నాయకులు మారారని భావిస్తూ అందుకే ఎన్నికల్లో ఆసక్తిగా పని చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తింటోంది. ఈ విషయం గమనించి ఏకతాటిపైకి వస్తే పార్టీకి మంచి రోజులు ఉంటాయి. లేదంటే అంతే.