వైసీపీలో భగ్గమన్న గ్రూపు రాజకీయాలు

Update: 2020-02-25 10:51 GMT
అధికార వైసీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు పొడచూపాయి. వైసీపీలోని రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం.. నిరసనలు తెలుపడంతో కాకరేగింది.

రాజోలు నియోజక వర్గంలో పోయిన సారి వైసీపీ ఓడిపోయింది. ఇక్కడి నుంచి జనసేన తరుఫున ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గెలిచారు. వైసీపీ ఓటమికి అభ్యర్థి బలహీనుడనే కారణంగా చెబుతారు. దీంతో ఇక్కడ పట్టుకోసం వైసీపీ నేతలు విడిపోయారు.

మాజీ కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు వర్గానికి పెదపాటి అమ్మాజీ వర్గానికి మధ్య రాజోలులో వివాదాలు ముదిరిపాకాన పడ్డాయి.

తాజాగా బొంతు వర్గీయులు సమావేశమై బొంతుకే బాధ్యతలు అప్పగించాలంటూ వైఎస్ఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తూ పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్న పెదపాటి అమ్మాజీ కి పదవులు కట్టబెడుతున్నారని బొంతు వర్గం ఆరోపించింది.

ఇక పోయిన సారి ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీచేసిన ఓడిపోయిన అమ్మాజీని వెంటనే ఇన్ చార్జి బాధ్యతలు నుంచి తప్పించాలని బొంతు వర్గం డిమాండ్ చేసింది. ఇలా వైసీపీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది.
Tags:    

Similar News