అన్న ఫేస్‌ బుక్ వ‌ద్ద‌న్నాడ‌ని.. చెల్లెలి ఘోరం

Update: 2017-09-18 10:30 GMT
ప్ర‌పంచ వ్యాప్తంగా సోష‌ల్ మీడియాకు బానిస‌ల‌వుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. సోష‌ల్ సైట్ల‌లో వీర విహారం చేసేస్తున్నారు యువ‌తీ యువ‌కులు. ఇది ఇప్పుడు అంటు వ్యాధి క‌న్నా ఘోరంగా త‌యారై.. యువ‌తే కాకుండా స్కూల్ విద్యార్థుల వ‌ర‌కు కూడా పాకింది. స్కూల్ నుంచి ఇంటికి రావ‌డే ఆల‌స్యం.. పుస్త‌కాల సంచీ ప‌క్క‌న ప‌డేసి.. ఫోన్ల‌తోనే కాల‌క్షేపం చేస్తున్నారు. వ‌ద్ద‌ని త‌ల్ల‌దండ్రులు ఎంత‌గా వారించినా పిల్లలు లెక్క‌చేయ‌డం లేదు. అంతేకాదు, చాటుగానో, మాటుగానో సోష‌ల్ సైట్ల‌తో కాల‌క్షేపం చేస్తూ.. త‌మ అమూల్య‌మైన స‌మయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న‌లో ఓ బాలిక ఫేస్‌ బుక్‌ కు తీవ్ర‌స్థాయిలో బానిస అయిపోయింది.

దీనిని గ‌మ‌నించిన ఆమె సోద‌రుడు ఆమెను మంద‌లించాడు. ఫేస్‌ బుక్కే జీవిత‌మా అని ప్ర‌శ్నించాడు. ఈ ప‌రిణామానికి తీవ్ర స్థాయిలో కుంగిపోయిన బాలిక ఘోరానికి పాల్ప‌డింది. ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇవీ..  ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక ప‌ద‌కొండో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో స్మార్ట్ ఫోన్‌కు బానిస అయిపోయింది. చ‌దువు - తిండి - నిద్ర మానేసి మ‌రీ ఫేస్‌ బుక్‌ - వాట్స్ యాప్‌ ల‌తోనే కాలం గ‌డిపేస్తోంది. దీనిని గ‌మ‌నించిన ఆమె సోద‌రుడు ఆమెను తీవ్రంగా మంద‌లించాడు. ఇలాగైతే.. చ‌దువు - ఆరోగ్యం ఏమైపోతుంద‌ని ప్ర‌శ్నించాడు. అయితే, ఈ చిన్న మంద‌లింపుకే ఆ బాలిక తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంది.

ఇంట్లో వారంతా స‌మీపంలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బంధువును విచారించేందుకు వెళ్లిన స‌మ‌యంలో ఈ బాలిక ఇంట్లోని ఫ్యాన్‌ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో ఇంట్లో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  చ‌నిపోవ‌డానికి కొన్ని రోజుల ముందు `నేను చ‌నిపోయాను` అని వాట్స్‌ యాప్‌ లో రాసుకుంద‌ని బాలిక త‌ల్లి మీడియాకు తెలిపింది. ఆమె భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకునే తన కొడుకు మంద‌లించాడ‌ని, అయితే, ఆమె ఇలా ఘోరానికి ఒడిగ‌ట్టింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ ప‌రిణామంపై స‌ర్వ‌త్రా ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  సోష‌ల్ మీడియా రాక‌తో యువ‌త త‌మ భావోద్వేగాల‌ను అణుచుకోలేక పోతోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News