విన్నంతనే వణుకు పుట్టే వైనమిది. చదివినంతనే మనసంతా చేదుగా మారటమే కాదు.. ఈ దుర్మార్గాలకు చెక్ పెట్టేదెలా? అన్న సందేహంతో పాటు.. అంతకంతకూ పెరుగుతున్న ఈ దారుణాలకు పసిమొగ్గలు బలి కావాల్సిందేనా? అన్న క్వశ్చన్ కు ఆన్సర్ లభించదు.
అభం శుభం ఎరుగని ఆరేళ్ల పాపను అత్యంత దారుణంగా వ్యవహరించిన వైనం వింటే కడుపులో తేవినట్లుగా ఉండటమేకాదు.. ఆ పాపానికి పాల్పడ్డ దుర్మార్గుడ్ని ఏం చేయాలన్న కోపం కలుగక మానదు. దేశ రాజధాని ఢిల్లీలోని స్కూల్లో రెండో తరగతి చదువుతున్న చిన్నారిని రేప్ చేసిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఖరీదైన గోలే మార్కెట్ ప్రాంతంలోని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై స్కూల్లో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న వ్యక్తి రేప్ చేసిన వైనం బయటకు వచ్చింది.
ఎన్‌డీఎంసీలో శాశ్వత ఉద్యోగి అయిన రామ్ 2 నెలలుగా స్కూల్లో విద్యుత్తు పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం స్కూల్ అయ్యాక ఇంటికి వెళుతున్న పాపను పిలిచి పంపు రూంలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు.
తాను చేసిన పనిని ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. ఇంటికి వెళ్లిన అనంతరం పాప మర్మాంగాల నుంచి రక్తం కారుతుండటాన్ని చూసిన తల్లి భయాందోళనతో ఆసుపత్రికి వెళ్లింది. పాపను పరీక్షించిన వైద్యుడు.. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లుగా వెల్లడించారు. దీంతో.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడ్నిపోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పాపపై లైంగిక వేధింపులు జరిపిన రాక్షసుడ్ని అదుపులోకి తీసుకొన్న పోలీసులు జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. 20 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే.. పాఠశాలలో పిల్లల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పాలంటూ డీసీడబ్ల్యూ పోలీసులతోపాటు స్కూల్ అధికారులకు ఎన్ హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఉదంతంపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వానికి.. పోలీసులకు నోటీసులు ఇచ్చింది.