పాక్ అధ్య‌క్షుడిపై 6 త‌ర‌గతి విద్యార్థి కేసు!

Update: 2016-12-25 04:29 GMT
పాకిస్థాన్ అధ్యక్షుడిపై ఆరోతరగతి విద్యార్థి కేసు పెట్టాడు. అది కూడా త‌న ప్ర‌సంగాన్ని దొంగ‌లించాడ‌నే ఆరోప‌ణ‌తో. ఈ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం  పాక్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా 141వ పుట్టినరోజు నేప‌థ్యంలో జ‌రిగింది.  మహ్మద్ అలీ జిన్నా 141వ పుట్టినరోజు సందర్భంగా తాను ఇవ్వనున్న ప్రసంగాన్ని అధ్యక్షుడి కార్యాలయ సిబ్బంది దొంగిలించారని, ఇందుకు తన సమ్మతిని తీసుకోలేదని 11 ఏళ్ల‌ మహ్మద్ సాబీల్ హైదర్ కేసు పెట్టాడు. ఈ మేరకు హైదర్ తండ్రి నాసీమ్ అబ్బాస్ నాసీర్‌ తో కలిసి ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు సదరు విద్యార్థి పిటిషన్‌ ను స్వీకరించిన న్యాయస్థానం తీర్పు ను రిజర్వ్‌ లో ఉంచింది.

జిన్నా జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 14న అధ్యక్షుడి కార్యాలయ సిబ్బంది తనను పిలిచి ప్రసంగించాల్సిందిగా కోరిందనీ, అప్పటి నుంచి ప్రసంగించేందుకు రిహార్సల్స్ చేయడంతో ఇంగ్లిష్ - సైన్స్ పరీక్షలు రాయలేకపోయానని మహ్మద్ సాబీల్ హైదర్  అన్నాడు. ఈనెల 22న అధ్యక్షుడి కార్యాలయంలో తన ప్రసంగాన్ని మరో స్కూల్ విద్యార్థిని ప్రసంగించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపాడు. అధ్యక్షుడి కార్యాలయ సిబ్బంది తన ప్రసంగాన్ని దొంగిలించారని మహ్మద్ సాబీల్ హైదర్  ఆరోపించాడు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి తాను కోర్టును ఆశ్ర‌యించాన‌ని 11 ఏళ్ల ఈ బుడ్డోడు తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News