స్వచ్ఛ రాజకీయాలకు అనుగుణంగా చర్యలు ఉండాలన్న మాటతో పాటు.. హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీలు.. ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్ని ఎత్తేయకూడదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటమే కాదు.. కేసుల ఉపసంహరణ కుదరదని.. ఒకవేళ ఇప్పటికే ఉపసంహరించుకుంటే వాటిని హైకోర్టులో సమీక్షించాలన్న ఆదేశాన్ని తాజాగా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇలా కేసులు ఎత్తేసిన వైనంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత అలా ఉపసంహరించుకున్న కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ పై 15 కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
2019 మే కంటే ముందు నమోదైన కేసుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై నమోదైన కేసుల్లో పదిహేను పవర్లోకి వచ్చాక ఎత్తేశారు. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే తీసేశారు. దీనికి సంబంధించిన కేసుల్ని సుప్రీం తాజా ఆదేశాల మేరకు మరోసారి సమీక్ష జరుపుతారా? అన్నది ప్రశ్నగా మారింది. ఇక.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన 15 కేసులు ఏమిటి? వాటిని ఎందుకు ఉపసంహరించుకున్నారు అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ముఖ్యమంత్రితో పాటు అధికార వైసీపీకి చెందిన పలువురు నేతలపై నమోదు చేసిన మరో 30 కేసుల్ని కూడా ఉపసంహరించుకున్నట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్ విషయానికి వస్తే.. ఆయనపై ఉపసంహరించిన కేసుల్లో అత్యధికం.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ పేరుతోనూ.. ఆధారాలు సరిగా లేవన్న కారణంగా చూపించి క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసి కేసులు ఎత్తేసినట్లుగా చెబుతున్నారు. పలు కేసుల్ని న్యాయస్థానాల్లో విచారణ అవసరం లేదని మూసేశారు. ఇంతకీ ఉపసంహరించుకున్న కేసులు ఏమిటి? అసలు వాటిని అప్పట్లో ఎందుకు పెట్టారు? అన్న వివరాల్లోకి వెళితే..
- 2011లో పులివెందుల పోలీస్ స్టేషన్ లో అల్లర్లకు పాల్పడ్డారని.. మారణాయుధాలు కలిగి ఉన్నారని.. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించిన నేరపూరిత బలవంతానికి దిగారని.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని.. బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
- 2015లో చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో.. నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. నేరపూరిత కుట్ర.. ఫోర్జరీ పత్రాల వినియోగం.. అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం.. ట్యాంపరింగ్.. చట్టవిరుద్ధంగా సెల్ ఫోన్ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం కారణాల్ని చూపి కేసులు నమోదు చేశారు.
- 2017 ఫిబ్రవరి 28న క్రిష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. వారి డెడ్ బాడీలకు పోస్ట్ మార్టమ్ జరుగుతున్నప్పుడు వైఎస్ జగన్ తో పాటు కొలుసు పార్థసారధి.. సామినేని ఉదయభాను తదితరులు గదిలోకి చొరబడి.. వైద్యాధికారిణిని అడ్డుకున్నారని.. ఆమెతో వాగ్వాదానికి దిగి వార్నింగ్ ఇచ్చారన్న కంప్లైంట్ మీద నందిగామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
- అప్పటి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబును చచ్చేంతవరకు చెప్పులతో కొట్టాలని రెచ్చగట్టేలా ప్రసంగాలు చేసి గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యను స్రష్టించారన్న కంప్లైంట్ మీద అనంతపురం జిల్లా నల్లచెరువు.. యాడికి.. పెదవడగూరు.. అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్.. పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసుల నమోదు.
- విద్వేషాలు రెచ్చగొట్టేలా వర్గాలను ఉద్దేశించి ప్రసంగించారన్న ఆరోపణపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేసుల నమోదు.