సీఎం జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్... ఎంత పని జరిగింది ?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి టూర్ క్యాన్సిల్ అయ్యింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కొందరు ముఖ్యమంత్రులు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ హాజరు అవుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కొద్ది రోజులుగా ఎడమెఖం పెడమొఖంగా ఉంటోన్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా ఏం చేస్తారు ? ఒకరికొకరు తారసపడితే పలకరించుకుంటారా ? ఏం జరుగుతుంది ? అన్న ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది. అయితే సడెన్‌గా ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయ్యింది.
ఈ రోజు ఉదయం జగన్ నడుస్తుండగా కాలుకు ప్రమాదం జరగడంతో ఆయన ఆకస్మికంగా ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి రోజు జగన్ ఉదయం 4 - 5 గంటల మధ్యలో నిద్రలేస్తారు. రాత్రి ఎంత ఆలస్యం అయినా కూడా జగన్ డైలీ దినచర్య మాత్రం ఉదయం అదే సమయంలో ప్రారంభమవుతుంది. ఆయన ఉదయం నిద్ర లేచిన వెంటనే వ్యాయామం చేస్తారు. డైలీ దినచర్యలో భాగంగా ఈ రోజు వ్యాయామం చేస్తోంటే కాలు బెణకడంతో ఆయనను వైద్యులు పరీక్షించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు.
వైద్యుల సూచన మేరకే జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్‌కు బదులుగా ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు హాజరు అవుతున్నారు. ఏదేమైనా జగన్ ఢిల్లీ టూర్ అనగానే ఏపీలో ఒక్కసారిగా అటు అధికార పక్షంతో పాటు ఇటు విపక్షంలోనూ కాస్త ఆసక్తి ఉంది. ఇప్పుడు జగన్ వెళ్లరన్న వార్తలతో ఇది చప్పబడిపోయింది. మరోవైపు ఇదే సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
కేంద్రంతోనూ ఇటీవల జగన్‌కు అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. పైగా ఏపీలో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు అవుతున్నా అప్పుడు కేంద్రం హామీ ఇచ్చిన పనులే చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. జగన్ అమిత్ షాను కలిసే టైం ఉంటే ఏపీకి చెందిన కొన్ని సమస్యలను అయినా ఆయనకు చెప్పే వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు ఆ ఆశలు అడియాసలు అయిపోయాయి.