సీఎం జగన్‌ తిరుపతి పర్యటన రద్దు .. భహిరంగ లేఖ విడుదల !

Update: 2021-04-10 10:45 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి తిరుపతి ప్రచారం పర్యటన రద్దు అయ్యింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ మేరకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న కారణంగా తిరుపతి పర్యటనకి  రాలేకపోతున్నానని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో.. నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు. ఇవాళ కరోనా బులెటిన్‌ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నా అని తెలిపారు. ‘మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉంది అని లేఖలో రాశారు. బాధ్యతగల సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానని, ఇటీవల తాను రాసిన లేఖలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు ఒకే చోట చేరితే వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యమే నాకు ముఖ్యం అని లేఖలో సీఎం తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ ఓటర్లకు లేఖలో కోరారు. గతంలో బల్లి దుర్గా ప్రసాద్ అన్నకి ఇచ్చిన మెజారిటీ కంటే ఇంకా , ఎక్కువగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారని ,ప్రతి ఒక్కరూ మరో నలుగురితో మన పార్టీ అభ్యర్థి గురు మూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ .. అభ్యర్థిస్తూ దేవుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలకి మన ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం జగన్ భహిరంగ లేఖ రాశారు.
Tags:    

Similar News