కుమార‌స్వామి ప్ర‌మాణానికి కేసీఆర్ జ‌ర్నీ ప‌క్కా

Update: 2018-05-22 04:10 GMT
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా జేడీఎస్ నేత కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ మ‌హోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన నిర్ణ‌యాన్ని కేసీఆర్ సోమ‌వారం తీసుకున్నారు. వాస్త‌వానికి త‌మ ప్రమాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిందిగా కేసీఆర్ ను కుమార‌స్వామి వ్య‌క్తిగ‌తంగా పోన్ చేసి మ‌రీ ఆహ్వానించారు.

అందుకు స్పందించిన కేసీఆర్‌.. తాను వ‌స్తాన‌ని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్ర‌భుత్వం కొలువు తీర‌నున్న నేప‌థ్యంలో బెంగ‌ళూరుకు వెళ్ల‌ట‌మా?  వ‌ద్దా?  అన్న సంశ‌యానికి కేసీఆర్ గుర‌య్యారు. దీంతో కాస్త ఆలోచించిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ముందుగా ఇచ్చిన మాట‌కు త‌గ్గ‌ట్లే తాను బెంగ‌ళూరుకు వెళ్లాల‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ఒక పూట ముందే కేసీఆర్ బెంగ‌ళూరుకు చేరుకుంటార‌ని చెబుతున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌త్యేక విమానంలో ఆయ‌న హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేర‌నున్నారు. మంగ‌ళ‌వారం రాత్రికి బెంగ‌ళూరుకు చేరుకోనున్న కేసీఆర్‌.. రాత్రికి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం జ‌రిగే ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రై.. సాయంత్రం రిట‌ర్న్ కానున్నారు. త‌న‌తో పాటు కొద్దిమంది పార్టీ ముఖ్య‌ల‌ను కేసీఆర్ త‌న వెంట తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News