వెనుకా ముందు లేకుండా తాను టార్గెట్ చేసిన వారిపై విరుచుకుపడే అలవాటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మీద కీలక వ్యాఖ్య చేశారు. ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్లాగ్ షిఫ్ ప్రోగ్రాం ‘దళితబంధు’ను ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకు అమలు చేయొద్దని ఆదేశించటం తెలిసిందే.
ఈసీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీడియాలో ఈసీ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి షాక్ లాంటిందని పేర్కొంటే.. విపక్ష కాంగ్రెస్.. బీజేపీలు మాత్రం సానుకూలాంశంగా.. తమ విజయంగా క్లెయిం చేసుకోవటానికి కంటే కూడా కేసీఆర్ చేసిన తప్పుల వల్లే ఈసీ ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించిందన్నట్లుగా వ్యాఖ్యానించటం తెలిసిందే. దళితబంధు పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేసిన ఈసీ నిర్ణయం తాలూకు ప్రభావం ఎవరి మీద ఎలా పడుతుందన్న దానిపై స్పష్టత రాని పరిస్థితి.
ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనసులోని ఆగ్రహాన్ని ఆయన దాచుకునే ప్రయత్నం చేయలేదు. కాకుంటే.. తొందరపడి నోరు జారని ఆయన ఆచితూచి అన్నట్లుగా స్పందించారు. విమర్శించటానికి.. వెలెత్తి చూపటానికి వీల్లేని రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు నిలిపి వేయాలని ఆదేశించి.. ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించిందేమో అనిపిస్తోంది. దళితబంధు కొనసాగుతున్న పథకం. దళితబిడ్డలెవరూ ఆవేదన చెందొద్దు. నవంబరు నాలుగు తర్వాత అందరికి స్వయంగా దళితబంధు నిధులను అందజేస్తా. ఎన్నికల ఆదేశం చిన్న ఆటంకం మాత్రమే’ అని పేర్కొన్న తీరుతో ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారన్న మాట వినిపిస్తోంది. మరి.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఈసీ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.