కూతురు కవిత కోసమేనా ?

Update: 2021-11-18 01:30 GMT
తాజాగా కెసిఆర్ ప్రకటించిన ఆరుగురు ఎంఎల్సీల జాబితాను చూస్తే అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే కొత్తగా ఎంపికైన ఎంఎల్సీల్లో బండ ప్రకాష్ కూడా ఉన్నారు. ఈయన ఎంపికను చూసిన తర్వాత అందర ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రస్తుత బండ రాజ్యసభ ఎంపీ. ఇంకా ఈయనకు మూడేళ్ళ పదవీకాలం బ్యాలెన్సుంది. ఇంత పదవీకాలం బ్యాలెన్సున్నా ఎందుకని బండను కేసీయార్ ఎంఎల్సీగా ఎంపిక చేశారు ?

ఎందుకంటే కూతురు కల్వకుంట్ల కవిత కోసమే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కవితకు ఒక్క పదవికూడా లేదు. కవితను ఎంఎల్సీగా ఎంపికచేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే టాక్ అందరికీ తెలిసిందే. అయితే కవితకు ఎంఎల్సీ పదవీ దక్కలేదు మంత్రివర్గం లోకీ తీసుకోలేదు. ఇప్పటికే కొడుకు మంత్రిహోదాలో ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు కాబట్టి మళ్ళీ కూతురు కూడా ఎందుకులే అనుకున్నట్లున్నారు.

సరే ఈలోగా గవర్నర్ కోటాలో ఎంఎల్సీని భర్తీ చేయాల్సిన అవసరమొచ్చింది. అయితే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపుకోసమని అర్జంటుగా కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి లాగేసుకుని ఎంఎల్సీ పదవికి నామినేట్ చేశారు. అయితే వివిధ కారణాలతో గవర్నర్ తమిళి సై ఆ నియామకానికి రెడ్ సిగ్నల్ చూపించారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఎంఎల్ఏల కోటాలో భర్తీ చేయబోయే ఎంఎల్సీల జాబితాలో కౌశిక్ కు కేసీయార్ అవకాశం ఇచ్చారు.

ఇదే ఎంపికలో బండ ప్రకాష్ ను కూడా ఎంపిక చేయటంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఈయనకు ఎంఎల్సీగా తీసుకుని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారనేది తాజా ప్రచారం. ఎంఎల్సీగా ఎంపికయ్యారు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తవ్వగానే రాజ్యసభకు రాజీనామా చేస్తారట. అప్పుడు ఖాళీ అయిన స్ధానాన్ని కేసీయార్ కూతురు కవితకు అప్పగించబోతున్నారనే టాక్ పార్టీలో మొదలైంది. అయితే బండ ముదిరాజ్ సామాజికవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడట.

మొన్ననే ఉపఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ ను కట్టడి చేయటానికే అదే సామాజికవర్గానికి చెందిన బండను మంత్రివర్గం లోకి తీసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈటలను ఎదుర్కోవటం కెసిఆర్ వల్లే కాలేదు ఇక బండ వల్ల ఏమవుతుందనేది ఒక డౌట్. ఈటలను ఓడించాలని కేసీయార్ శతవిధాల ప్రయత్నించినా సాధ్యంకాలేదు. బెదిరింపులు, బుజ్జగింపులు, ఫిరాయింపులు, ప్రలోభాలు, పంపకాలు ఇలా ఎన్నిరకాలుగా ప్రయత్నించినా చివరకు ఈటలే గెలిచారు. మొత్తానికి కవితకు పదవి కోసం కెసిఆర్ చాలా పావులు కదిపినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News