ఆ 4 ప్రాంతాల్లోనే యాక్టీవ్ కేసులు : కేసీఆర్!

Update: 2020-05-16 17:30 GMT
తెలంగాణ లో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఈ మహమ్మారి యాక్టివ్‌ కేసులు లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ ‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తామని, అలాగే కేంద్రం విధించిన తాజా లాక్ ‌డౌన్‌ గడువు ఈ నెల 17తో ముగు స్తుంది. ఈ సందర్భంగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి, ఆ తరువాత వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి  దానికి తగ్గ వ్యూహం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

రాష్ట్రంలో . ఎల్బీనగర్ - మలక్‌ పేట - చార్మినార్ - కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ జోన్లలో 1,442 కుటుంబాలున్నాయి. యాదాద్రి భువనగిరి - జనగామ - మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు వలస కూలీలకు కొందరికి వైరస్‌ సోకినట్లు తేలింది తప్ప - ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్‌ లేదు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్‌ లోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులున్న నాలుగు కంటైన్ మెంట్‌ జోన్లలో లాక్‌ డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం అని, లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి - చికిత్స చేస్తున్నాం అని సీఎం వెల్లడించారు.

 అలాగే, వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్నచర్యలు కొనసాగిస్తూనే - వర్షా కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. అలాగే ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.  వైరస్‌ సోకినా ఎక్కువ మంది కోలుకుంటున్నారు అని, రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ అని తెలియజేసారు. అలాగే, హైదరాబాద్‌ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని మరో 45 బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ - మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ను ఆదేశించారు.
Tags:    

Similar News