తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నంతనే గుర్తుకు వచ్చే విషయాల్లో ముఖ్యమైనది ఆయనకున్న సెంటిమెంట్. ఏదైనా కీలకమైన పనులు షురూ చేయాలంటే ఆయన ముహూర్తాన్ని.. జాతకాల్ని బలంగా నమ్ముతారన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. న్యూమరాలజీ ఆయనిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకే.. ఏదైనా కీలకమైన పనిని ప్రారంభించేందుకు 'ఆరు'ను ఆయన తన అదృష్ట సంఖ్యగా భావించటం తెలిసిందే. ఒకవైపు ఆరును అంతలా అభిమానిస్తూనే.. ఆయన తన కలల పథకాలకు మాత్రం 'పది'ని వాడటం ఈ మధ్యన కనిపిస్తుంది.
'ఆరు' తీసుకొచ్చే అదృష్టాన్ని 'పది' తీసుకురావటం లేదన్న మాట గులాబీ నేతల్లో తరచూ వినిపిస్తోంది. ఆరును నమ్ముకున్న ప్రతిసారి అంతో ఇంతో మిగిలేదని.. విజయం ఖాయమయ్యేదని.. పదిని నమ్మకున్న నాటి నుంచి ఎదురుదెబ్బలు తప్పట్లేదని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. ఉదాహరణలు సైతం చూపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం రూ.10 వేల ఫార్ములాను నమ్ముకున్నారు కేసీఆర్.
భారీగా విరుచుకుపడ్డ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రేటర్ వాసులకు సాంత్వన కలిగించే రీతిలో.. వర్షం కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేసేలా చెప్పటమే కాదు.. చేతల్లోనూ అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని దించారు. పెద్ద ఎత్తున రూ.10 వేల చొప్పున పరిహారాన్ని పంచటం షురూ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రూ.10వేల పంపిణీలో అధికారులు.. కిందిస్థాయి సిబ్బంది చేతి వాటం కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మార్చింది.
వర్షాల కారణంగా నష్టపోయిన వారికి మాత్రమే అందాల్సిన రూ.10 వేల పరిహారం కాస్తా.. అందరికీ అందటం మొదలయ్యాక అసలు రభస మొదలైంది. చూస్తూ.. చూస్తూ రూ.10వేలు వస్తుంటే వదులుకోవటం ఎందుకున్నట్లుగా భావించటంతో గులాబీ బాస్ కు కొత్త తలనొప్పి ఎదురైంది. ఒకసారి డిసైడ్ అయితే తన మాటను సైతం తాను వినేందుకు ఇష్టపడని కేసీఆర్.. ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా సరే.. రూ.10వేల పంపిణీని మాత్రం అపొద్దంటే అపొద్దని చెప్పేశారు.
ఇలాంటివేళ.. రూ.10వేలను సొంతం చేసుకోవటానికి మొదలైన ఆరాటం గులాబీ బాస్ కు తలనొప్పిగా మారటమే కాదు.. ఇలా ఇచ్చుకుంటూ పోతే.. వందల కోట్లు కాస్తా వేల కోట్లలోకి వెళ్లిపోవటం ఒక ఎత్తు అయితే.. రూ.10వేల తాయిలంతో మైలేజీ కంటే కూడా డ్యామేజీ ఎక్కువగా అవుతుందన్న విషయాన్ని గుర్తించింది. అందుకే.. గ్రేటర్ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే రూ.10వేల పరిహారం అందిస్తామని చెప్పటం.. చివరకు ఫలితం తేడాగా రావటంతో రూ.10వేల పంపిణీ అర్థాంతరంగా నిలిపివేశారు. గ్రేటర్ చేదు అనుభవంతో అయినా పాఠాన్ని నేర్చుకోవాల్సిన కేసీఆర్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షల భారీ మొత్తాన్ని తాయిలంగా పంచాలన్న సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చారు.
ఇలాంటివేళలో పలువురు గ్రేటర్ అనుభవాన్ని గుర్తుకు తెచ్చినా.. రూ.10 వేలు రూ.10 లక్షలకు పోలిక ఎక్కడ ఉందన్న ధీమాతో పాటు.. తాను సిద్ధం చేసిన దళితబంధు తిరుగులేని రాజకీయ అస్త్రంగా మారుతుందని భావించారు. అయితే.. ఆరు తనకెంత అదృష్టాన్ని తీసుకొస్తుందో.. పది అంతే దురదృష్టాన్ని మిగులుస్తుందన్న విషయాన్ని అంచనా వేయటంతో కేసీఆర్ విఫలమయ్యారు. ఇప్పటికైనా తనకు అచ్చిరాని పదిని గులాబీ బాస్ వదిలేస్తారా? ఈసారి 'పది'కి మరింత మెరుగులు దిద్ది మరింతగా అభాసుపాలు అవుతారా? అన్నది కాలమే సరైన సమాధానం ఇస్తుందని చెప్పక తప్పదు.