అలాగే ఉంది కాదు నేతల వ్యవహారం చూస్తుంటే. కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమంటు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండ్ కో నానా గోల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వరి రాజకీయం తారాస్ధాయికి చేరుకోవటంతో కేంద్రంపై యుద్ధమే అంటు కేసీయార్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కొద్దిరోజులు హైదరాబాద్ లోనే కూర్చున్నారు. తర్వాత జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు. అన్నీ అయిపోయి చివరకు శాపనార్ధాల్లోకి దిగారు.
మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి తన సహచరులతో కలిసి మాట్లాడుతూ తొందరలో జరగబోయే యూపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా మూతి పగలటం ఖాయమన్నారు. మోడీ, అమిత్ షా పైన ఎంత కోపమున్నా మరీ వాళ్ళ మూతులు పగిలిపోవాలని ప్రత్యర్ధులు ఎవరైనా కోరుకుంటారా ? కానీ శ్రీహరి అలాగ కోరుకోవటమే మరీ విచిత్రంగా ఉంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడుతుందని జోస్యం చెప్పటం వరకు ఓకేనే. కేసీయార్ మీద కోపాన్ని కేంద్రం తెలంగాణాలోని రైతుల మీద చూపుతోందని మండిపోయారు.
కేసీయార్ కోపాన్ని కేంద్రం రైతుల మీద చూపటం ఏమిటో కడియమే చెప్పాలి. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూటమిని ఏర్పాటు చేస్తున్నారన్న కోపం కేసీయార్ మీద మోడీ, షా కు ఉందట. కడియం చెబితే కానీ కేసీయార్ ఆ పని చేస్తున్నట్లు ఎవరికీ తెలీదు. ఎందుకంటే అప్పుడెప్పుడో కేసీయార్ ప్రయత్నం చేసిన మాట వాస్తవమే కానీ అడుగులు ముందుకు పడకపోవటంతో ప్రయత్నం ఎప్పుడో ఆగిపోయింది. కాబట్టి దళిత, రైతు వ్యతిరేక విధానాలతో వెళుతున్న బీజేపీని బొంద పెట్టాలని కడియం పిలుపిచ్చారు.
వరి రాజకీయం తారా స్ధాయికి చేరుకోవటంతో ముందు కేసీయార్ యుద్ధం ప్రకటించారు. దాన్ని కేంద్రం పట్టించుకోలేదు. తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏల బృందాన్ని తీసుకుని కేసీయార్ ఢిల్లీలో మూడు రోజులు కూర్చున్నారు. పనేమీ జరగలేదు. ఈమధ్యనే మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపినా వర్కవుట్ కాలేదు. దాంతో ఏమి చేయాలో తెలీక ఇందిరాపార్కు దగ్గర నిరసనలన్నారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో ఇపుడు దిక్కుతోచటంలేదు. చివరకు శాపనార్థాలకు దిగినట్లుంది కారు నేతలు.